Movies

జబర్దస్త్ గురించి రోజా షాకింగ్ కామెంట్స్….ఆలా అనేసిందేమిటి…కారణం అదేనా ?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో వాళ్ళు సినిమాల్లో ప్రొడ్యూసర్ గానో ,మరోరకంగానో ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదే. తమిళనాడులో ఎంజీఆర్,జయలలిత,తెలుగులో ఎన్టీఆర్ ,చిరంజీవి ,పవన్ కళ్యణ్ ఇలా అందరూ సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినవాళ్లే. ఇలా చాలామంది ఉన్నారు. అయితే సీఎం లుగా ఉంటూ, రాజకీయాల్లో కొనసాగుతూ కూడా సినిమాల్లో చేసిన ఘనత ఎంజీఆర్, ఎన్టీఆర్ లకు ఉంది. ఇక చిరంజీవి రాజకీయాలు పూర్తిగా పక్కనే పెట్టేసి సినిమాల్లో బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. అయితే వీళ్లంతా మగవాళ్ళు

ఇక ప్రస్తుతం ఆడవాళ్ళ విషయానికి వస్తే.. వైస్సార్ సిపిలో చురుకైన కార్యకర్తగా ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన రోజా జబర్దస్త్ ప్రోగ్రాం చేస్తూనే ఉంది. గతంలో అయితే ప్రతిపక్షం లో ఉండేది. ఇప్పుడు అధికార పక్షం. పైగా నగరి ఎమ్మెల్యే గానే కాదు, ఎపి ఐ ఐ సి ఛైర్ పర్సన్ గా కూడా రోజా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ లో నాగబాబు మానేసినా ,రోజా ఒంటిచేత్తో ఆకార్యక్రమాన్ని నడిపిస్తూ తన సత్తా చాటుతూనే ఉంది. అయితే ఇప్పుడు రోజా జబర్దస్త్ వదిలేస్తానని చెబితే, జబర్డస్ట్ అభిమానులు జీర్ణించుకోగలరా ? అసలు ఆమె అలా అంటుందా?నిజానికి వైస్సార్ సిపిలో రోజాకు ఫైర్ బ్రాండ్ గా ముద్రపడింది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై విరుచుకు పడడం అందరికీ తెల్సిందే.

అయితే ఈమధ్య ఓ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు ఒంటికాలిపై లేచినంత పనిచేసింది. తాను తన ఆత్మ సంతృప్తి కోసమే ఏదైనా చేస్తానే తప్ప ఎవరో ఏదో అన్నారని మానేసేది లేదని, తాను అనుకుంటే తప్ప మానేది లేదని రోజా తెగేసి చెప్పింది. అయినా మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేని అభ్యంతరం మీడియాకు ఎందుకో అంటూ సీరియస్ అయింది. ” సినిమాలు, రాజకీయాలు నాకు రెండు కళ్లు ప్రొఫెషన్ సినిమా అయితే.. రాజకీయాలు ప్రాణం . నటిగా ప్రజల గుండెల్లో స్థానం ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటున్నా. రాజకీ యాల్లో ఉంటె , మోడ్రన్ డ్రస్సులు వేసుకోకూడదా? డాన్సులు చేయకూడదా..? అలా అయితే గతంలో ముఖ్యమంత్రి గా ఉంటూ ఎన్టీఆర్ డాన్స్‌లు చేయలేదా? అంతెందుకు ఇప్పుడు బాలయ్య సినిమాలు చేయడం లేదా? పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. సినిమాలు చేస్తున్నాడు’ అంటూ వరుస పెట్టి కడిగి పారేసింది.