Health

మానవ శరీరం గురించి కొన్ని నమ్మలేని నిజాలు…మిస్ కాకుండా చదవండి

మానవ శరీరం గురించి ఈ విషయాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే విషయాలు మనలో కొంత మందికి తెలుసు. అలాగే కొంత మందికి తెలియకపోవచ్చు.

రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో కొత్తవివస్తాయి .

ఒక అంగుళం చర్మం మీద ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా? దాదాపుగా 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది. చాలా ఆశ్చర్యం కలుగుతుది కదా.

మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
మనిషికి వచ్చే వ్యాధులలో 90 శాతం ఒత్తిడితో వచ్చేవే.

మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె… మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి. నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.