Movies

ఆ రెండు మార్చుకుంటే మహేష్ కి తిరుగు ఉండదు…మరి మార్చుకుంటాడా లేదా ?

ఇటు మాస్,అటు క్లాస్ లో క్రేజ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ విభిన్న పాత్రలతో మెప్పిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోగా తన దూకుడు కొనసాగిస్తున్నాడు. కొత్తదనం గల కథలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. అందులో భాగంగానే నిజాయితీగల సీఎం ఉంటె స్టేట్ ఎలా బాగుపడుతుందో భరత్ అను నేను మూవీతో చూపించాడు.

ఇక మహర్షి మూవీ అయితే వ్యవసాయం ప్రాధ్యాన్యతను చాటిచెప్పాడు. ఈ మూవీతో చాలామంది యూత్ పొలం బాట పట్టారు. శ్రీమంతుడు మూవీలో గ్రామాల దత్తత కాన్సెప్ట్ తెచ్చి,ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. ఇక మొన్న సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తో సైనికుడి పాత్రలో తన సత్తా చాటాడు. అయితే గతంలో సైనికుడు,అతిధి వరుస ప్లాప్ ల తర్వాత ఏడాదికి రెండు సినిమాలు కాకుండా ఒక్కటే వస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఏడాదికి ఒక్కటి కూడా రావడంలేదు.

రెండేళ్లు గ్యాప్ తర్వాత సినిమాలు వస్తున్నాయి. ఇక నటన పరంగా ఒకే అయినా, స్టెప్స్ పరంగా వీక్ అనే మాట ఉంది. ఇది సరిలేరు నీకెవ్వరూ మూవీలోని మైండ్ బ్లాక్ సాంగ్ తో మాస్ ని మెప్పించాడు. ఇకనునుంచి మాస్ స్టెప్పులతో అదరగొడతాడా లేదా అనేది తేలాలి. మరోవైపు తాజాగా సర్కారు వారి పాట మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పోస్టర్ కూడా రిలీజయింది. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ నడవడం లేదు.