Beauty Tips

ఉల్లిలో ఉన్న ఈ ప్రయోజనాలు గురించి మీకు తెలుసా ?

మనం ప్రతి రోజు ఉల్లిపాయను వంటల్లో వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి వెంట నీరు కారుతుంది. ఉల్లిలో సల్పర్ ఉండుట వలన ఈ విధంగా కంటి నుండి నీరు వస్తుంది. ఇలా నీరు రావటం వలన కంటిలో ఉన్న మలినాలు అన్ని తొలగిపోతాయి. ఉల్లి తినటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

చెడు కొలస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొటిమలను చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. ఉల్లిరసంను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిరసంలో తేనే కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న జిడ్డు,మలినాలు,మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

ఉల్లిపాయ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న ఫిగ్మింటేషన్ అంతా మాయం అవుతుంది.