Movies

టాలీవుడ్ డైరెక్టర్స్ వద్దు అంటున్న టాలీవుడ్ హీరోలు…తీరు ఇంతలా మారిందా ?

ఒకప్పుడు హీరోయిన్స్ తెలుగు కాకుండా హిందీ నుంచి,అలాగే ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ని తీసుకు రావడం మొదలైంది. ఇప్పుడు ఇది డైరెక్టర్స్ దాకా పాకినట్లు టాక్. మనోళ్ళకి మన డైరెక్టర్లంటే అంతగా నమ్మకంలేనట్టు కన్పిస్తోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి,స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ , కొరటాల శివ, వంటి నలుగురైదుగురు మినహా పెద్దగా హిట్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు.

అందుకే హిట్ కోసం పరభాషా డైరెక్టర్లను మన స్టార్ హీరోలు ఎంచుకుంటున్నారా అనిపిస్తోంది. మన వాళ్ళను పాన్ ఇండియా డైరెక్టర్స్ గా మార్చడానికి బదులు పరభాషా డైరెక్టర్స్ తో పాన్ ఇండియా మూవీస్ గా మార్చుకోవాలని చూడడం విమర్శలకు తావిస్తోంది. జక్కన్నతో ఆర్ ఆర్ ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూవీకి ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. కెజిఎఫ్ 2తర్వాత తారక్ ని డైరెక్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్లు విన్పిస్తోంది. అయితే కన్నడ హీరోలను వదిలిపెట్టి తెలుగు హీరోలను డైరెక్ట్ చేయడం ఏమిటని కన్నడిగులు ఇప్పటికే ప్రశాంత్ ని హెచ్చరించారట. అలాగే విజయ్ కి వరుస హిట్స్ ఇస్తున్న అట్లీ అనే డైరెక్టర్ పై తారక్ కన్నుపడిందట. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తో ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు.

ఇక పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట తర్వాత ఓ అరవ డైరెక్టర్ తో పనిచేస్తాడని టాక్. ఖైదీతో హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ బాగా నచ్చడంతో మహేష్ అటువైపు మొగ్గుతున్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ నిర్మించబోతోందని టాక్. టాలెంట్ కోసం పక్క రాష్ట్రాల డైరెక్టర్స్ పై మన హీరోలు లుక్ వేయడం చర్చకు దారితీసింది. అయితే తమిళ,కన్నడ,హిందీ డైరెక్టర్లను పెట్టుకుంటే పాన్ ఇండియా మూవీగా మారుతుందని, కాసుల వర్షం కురిపిస్తుందని మనోళ్లు భావిస్తున్నారు.