Movies

విజయ్ దేవరకొండ కెరీర్ లో వెనకపడటానికి కారణం ఇదేనట…మార్చుకుంటాడా ?

పెళ్లిచూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీతో యూత్ కి కనెక్ట్ అయ్యాడు. గీత గోవిందం మూవీతో స్టార్ హీరో అయ్యాడు. తక్కువ సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అవ్వడం అంటే మామూలు విషయం కాదు.

లాక్ డౌన్ సమయంలో కూడా వినూత్నంగా సాయం అందించాడు. వరుస హిట్స్ తో దూసుకెళ్లిన విజయ్ ఒక్కసారిగా జోరు తగ్గింది. వరుసగా ప్లాప్ లు వెంటాడాయి. 70కోట్లు బిజినెస్ చేసిన గీత గోవిందం నాటికి ఇప్పటికీ పరిస్థితిలో చేంజ్ వచ్చింది. యూత్ లో క్రేజ్ ఉన్నా సరే, ఇతడి సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు.

నోటా మూవీకి ఓపెనింగ్ వచ్చినా రెండో రోజు నుంచి డౌన్ అయింది. టాక్సీవాలకు మంచి టాక్ వచ్చిందే కానీ, కలెక్షన్ 30కోట్లు దాటలేదు. డియర్ కామ్రేడ్,వరల్డ్ ఫేమస్ లవర్ మూవీస్ కూడా వసూళ్లు రాబట్టలేదు. రౌడీ స్టార్ గా ముద్రవేసుకున్న విజయ్ సిక్స్ పాక్ తోనే కాదు,చొక్కా లేకుండా కూడా దర్శనమిచ్చాడు. బయట ఎంతలా ఉన్నా సరే, లైక్ చేస్తున్న ఫాన్స్ , సినిమాల విషయంలో కరుణించడంలేదు.