రీమేక్ చేసిన మలయాళ మూవీస్….ఎన్ని హిట్ అయ్యాయో చూడండి
తెలుగులో డైరెక్ట్ గా వచ్చిన సినిమాల కన్నా ..రీమేక్ సినిమాలపై మన స్టార్ హీరోలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పరభాషా చిత్రాల హక్కులు కొని సినిమాలు తీసి హిట్స్ అందుకుంటున్నారు. ఇది గత 20,30ఏళ్లుగా నడుస్తున్నా, ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. అలా మలయాళం మూవీస్ చాలా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం,హిట్లర్ విక్టరీ వెంకటేష్ నటించిన ,దృశ్యం .. తరుణ్ నటించిన నువ్వేకావాలి ఇలా చాలా సినిమాలున్నాయి.
ముమ్ముట్టి హీరోగా చేసిన మలయాళ మూవీ ఆధారంగా తెలుగులో చిరంజీవి చేసిన పసివాడి ప్రాణం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మలయాళంలో హిట్ కొట్టిన దృశ్యం తర్వాత చాలా భాషల్లో వచ్చింది. తెలుగులో వెంకటేష్,మీనా నటించిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. మీర్ అనే మలయాళ మూవీని తరుణ్, రిచా జంటగా విజయ భాస్కర్ తెలుగులో రీమేక్ గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. అలాగే మలయాళంలో హిట్ అయిన మూవీ ఆధారంగా హనుమాన్ జంక్షన్ మూవీ తీశారు. అర్జున్,జగపతి బాబు నటించిన ఈ మూవీ మంచి హిట్ అయింది.
బిగ్ బాస్ లాంటి సినిమాలతో ప్లాప్ లో ఉన్న చిరంజీవితో ముత్యాల సుబ్బయ్య తీసిన హిట్లర్ మూవీకి మాతృక మళయాళమే.ఇక మలయాళంలో అక్ష దూతూ మూవీని తెలుగులో మాతృ దెవొ భవ మూవీని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. నాగచైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ మూవీ కూడా మలయాళ మాతృకే. మీసా మాధవ మలయాళ మూవీ అధర్మగా వచ్చిన దొంగోడు మూవీ మంచి హిట్ అయింది. మలయాళంలో హిట్ కొట్టిన మూవీ ఆధారంగా తెలుగులో ఫలక్ నామా మూవీ తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓటిటి లో రిలీజైన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ… మనిషంటే ప్రతీకార మళయాళానికి రీమేక్. మంచి హిట్ అందుకుంది.