Movies

సూర్య సినిమాలలో ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే అసలు నమ్మలేరు

సినిమా వేరు,లైఫ్ వేరు.. సమాజంలో పరిస్థితిలు వేరు .. ఇలా చెప్పడం వింటుంటాం. కానీ హీరో సూర్య నటించిన సినిమాల్లో పెట్టిన సీన్స్ నిజంగా జరిగిపోతున్నాయట. సరదాగానే సీన్లు పెట్టినా అవి నిజం అయిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అసలే 2020సడన్ గా ఇస్తున్న ట్విస్ట్ లు ,దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇక కరోనా మహమ్మారి సరేసరి. ఒకటి కాదు,రెండు కాదు,వరుసగా సూర్య సినిమాల్లో సీన్స్ నిజంగా జరిగిపోతున్నాయట. గజినీ మూవీలో ఎయిర్ వాయిస్ మొబైల్ కంపెనీ ఓనర్ అన్నీ వదిలేసి ఓ అమ్మాయి వెనకాల తిరుగుతాడు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇక చెప్పక్కర్లేదు. అయితే ఇండియన్ మొబైల్ మైక్రో మాక్స్ కంపెనీ కో ఫౌండర్ ని రాహుల్ శర్మ ఆసిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది గజినీ మూవీకి సరిపోయేలా ఉంటుంది.

పోనీ ఇదేదో అని కొట్టిపారేస్తే,.. సెవెంత్ సెన్స్ మూవీలో చైనా డాంగ్లీ బయో వార్ కోసం ఇండియా వచ్చి స్ట్రీట్ డాగ్ కి వైరస్ ఎక్కించే సీన్ ఉంటుంది. సరిగ్గా అలాంటి వైరస్ మాదిరిగా ఇప్పుడు కరోనా వచ్చి మొత్తం అల్లకల్లోలం చేసేసింది. అన్ని రంగాలు దెబ్బతిని పోయాయి. ఇక వీడోక్కడే మూవీలో హీరో క్రికెట్ లో వరల్డ్ కప్ కొట్టినట్లు ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మనదేశం నిజంగా 2012 వరల్డ్ కప్ కొట్టింది. బ్రదర్స్ మూవీలో బాన్ అనే విషయం చూపించారు. ఆ సినిమాలో ఓ దేశాన్ని బాన్ చేసారని ఉంటుంది. 2016తర్వాత ఒలింపిక్స్ లో రష్యా బాన్ అయింది. ఎన్ సి సి మాస్టర్ లా ఉండే సూర్య డిఎస్పీ గా ఛార్జ్ తీసుకోవడం సింగం 2లో చూసాం. అప్పుడు పోలీసులు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అలాగే మార్చిలో లాక్ డౌన్ విధిస్తూ జనాన్ని ఇంట్లో ఉండేలా ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చి ప్రిపేర్ చేశారు. ఊరంతా కర్ఫ్యూ,చెక్ పోస్టులు మూసెయ్యడం ఇవన్నీ ఆ సినిమాలో కనిపిస్తాయి.

ఇక ఈ సినిమాలో జనాలు ఎలా కొట్టుకున్నారో సేమ్ ఎపి,తెలంగాణ బోర్డర్ లో కనిపించింది. ఇక బందోబస్తు సినిమాలో పంటవేసి, కొన్ని నెలలు కష్టపడి ఆశగా ఎదురుచూస్తున్న వేళ కొన్ని కోట్ల మిడతలు వచ్చి నాశనం చేస్తుంటే,చాలా బాధగా ఉంటుంది. కానీ నిజంగా ఆఫ్రికాలాంటి కొన్ని దేశాల్లో జరిగినపుడు ఎంతగా ఆశ్చర్యపోయాం. గ్యాంగ్ మూవీలో రమ్యకృష్ణ,సూర్య బిజినెస్ పీపుల్స్ సిబిఐ రైడ్స్ పేరిట ఇళ్లకు వెళ్లి, నానా హంగామా చేస్తూ,ఇష్టం వచ్చినంత నొక్కేస్తుంటే థ్రిల్ గా ఉంటుంది. సరిగ్గా మన గుంటూరుకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి ఈ మధ్య సిబిఐ వాళ్ళ పేరుతొ రైడ్స్ జరిగాయి. తీరా పోలీసులు విచారణ జరిపించేసరికి లీనా అనే మలయాళీ నటి అని తేలింది. ఇక 2019లో సూర్య నిర్మించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఉరియాడి 2’ మూవీలో హీరో పనిచేసే ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతుంది. పరిసర ప్రాంతాల్లో గందరగోళం. సరిగ్గా ఇటీవల వైజాగ్ లో అదే జరిగింది.