Movies

నిహారిక నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా ?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం నిన్న చాలా వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీకి సంబంధించి అందరూ హాజరై నా పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే పవన్ ఈ మధ్యకాలంలో బయటకు ఎక్కడికీ రావడం లేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నాడు.

కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి పవన్ అసలు బయటికి రావడం లేదని ఒక వర్గం అంటుంటే… మరొక వర్గం నితిన్ పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు కదా.. మరి నిహారిక నిశ్చితార్థానికి రాకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో ఏమైనా గొడవ లు ఉన్నాయా అనే అంశం మళ్లీ లేవనెత్తుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నిహారిక కు ఫోన్ చేసి నిశ్చితార్థానికి రావటం కుదరటంలేదు అని, కచ్చితంగా పెళ్లి కి వస్తానని చెప్పాడట. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అసలు విషయం తెలియాలి అంటే ఒక రెండు రోజులు ఆగితే సరిపోతుంది.