Movies

యమదొంగ సక్సెస్ వెనుక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా ?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కి నాలుగేళ్ల గ్యాప్ తర్వాత హిట్ అందించి యంగ్ టైగర్ గా నిలబెట్టిన మూవీ యమదొంగ. తారక్ కి స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి ఈ మూవీ తెరకెక్కించాడు. అంతేకాదు లుక్స్ పరంగా కూడా ఈ సినిమాతో సరికొత్తగా చూపించాడు జక్కన్న. ఈ సినిమా మొత్తం 29కోట్ల షేర్ కలెక్ట్ చేసి,పోకిరి తర్వాత ఆల్ టైం రికార్డ్ లో టాప్ 2మూవీగా నిల్చింది. కర్ణాటకలో 2కోట్లు షేర్ కలెక్ట్ చేసిన తొలిమూవీ ఇది. 205సెంటర్స్ లో 50రోజులు,57సెంటర్స్ లో 100రోజులు ఆడింది. ఇటీవల తమిళంలో డబ్బింగ్ అయి సక్సెస్ అయింది. నిజానికి అప్పటికే ఐదు మూవీస్ తో హిట్స్ కొట్టి,మంచి జోష్ మీదున్న జక్కన్న తర్వాత మూవీ తారక్ తో చేయడానికి ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. అందుకే విక్రమార్కుడు బ్లాక్ బస్టర్ తర్వాత విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పెట్టాడు. భారీ జానపద చిత్రం ముద్ర పేరుతొ చేయాలని నిర్ణయించాడు. 40కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని, ఇంత బడ్జెట్ పెట్టడం కష్టమని భావించి,మరో మూవీ చేయాలని ఆలోచిస్తుంటే ఎన్టీఆర్ నటించిన యమగోల మూవీ గుర్తొచ్చింది. వెంటనే ఓ లైన్ తీసుకుని సోషియో ఫాంటసీ మూవీ తీయాలన్న నిర్ణయానికి వచ్చాడు.

దాంతో రాజమౌళి ఫారిన్ టూర్ వెళ్లొచ్చే లోగా విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేయగా, రత్నం మాటలు అందించారు. రాఖి షూటింగ్ లో ఉన్న తారక్ ని కల్సి,స్టోరీ లైన్ వినిపించడమే కాకుండా బరువు తగ్గాలని కూడా జక్కన్న సూచించాడు. తారక్ ఫారిన్ వెళ్లి వైద్యుల సూచన మేరకు బరువు తగ్గించుకుని స్లిమ్ గా తయారై రావడంతో జక్కన్న ,కీరవాణి షాకయ్యారు. స్లిమ్ గా తయారైన విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకుంటే అప్పటికే ఫొటోస్ వైరల్ అయ్యాయి. యముడి గెటప్ కి మోహన్ బాబుని అడిగినవెంటనే ఒకే చేసారు.

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్,మీరా చోప్రా లను సంప్రదించినా,చివరికి ప్రియమణికి ఛాన్స్ దక్కింది. రెండో హీరోయిన్ గ మమతా మోహన్ దాస్. గుణ్ణం ఊర్మిళ,పి చిరంజీవి ప్రొడ్యూసర్స్. 2007జనవరి 2న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి,అన్నపూర్ణ స్టూడియో,,రామానాయుడు స్టూడియో ,తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో, అలాగే వికారాబాద్ ఫారెస్ట్ కొన్ని సీన్స్ తీసి,రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేసారు. 300మంది 2నెలలు శ్రమించి యమలోకం సెట్ వేశారు.

సెట్ లో సెంథిల్ కుమార్ 400టన్నుల లైటింగ్ ఉపయోగించారు. ఏమంటివి ఏమంటివి డైలాగ్ కంఠస్థం చేసి, సింగిల్ టేక్ లో తారక్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 7నెలల కాలంలో 148పనిదినాల్లో షూటింగ్ పూర్తయింది. మూడునెలలు గ్రాఫిక్స్ వర్క్ అయింది. ఇరాన్ కంపెనీ సహకారంతో యానిమేషన్ కూడా అయింది. మొత్తం 23కోట్లు లెక్కతేలింది. విశ్వామిత్రుని వేషం ప్రభాస్ వేస్తున్నాడని టాక్ నడిచింది.

అయితే బ్యానర్ కోసమే అలా చేసాడని తర్వాత తెల్సింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు,దర్శక రత్న దాసరి నారాయణరావు లాంటి మహామహులంతా ఆడియో ఫంక్షన్ కి వచ్చారు. తారక్ తల్లి తొలిసారి హాజరైన వేడుక అదేకావడంతో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. 2007ఆగస్టు 15న 350ప్రింట్స్ తో భారీ అంచనాలతో విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చింది. అయితే అన్నింటా తారక్ కన్పిస్తాడు. అంతలా ఇందులో తారక్ నట విశ్వరూపం చూపించాడు. ఇక మోహన్ బాబు మరో హైలెట్. హీరోయిన్స్ గ్లామర్ ,సాంగ్స్ అన్నీ హిట్. ఖుష్భు తప్ప మొత్తం 7గురు హీరోయిన్స్ తో ఇందులో తారక్ డాన్స్ చేస్తాడు. మొదటి వారం 15కోట్ల షేర్ కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరులో కోటి రూపాయలు మొదటివారంలో వసూలు చేయడం మరో రికార్డ్. నెల్లూరు జిల్లాలో 58లక్షలు వసూలు చేసింది. నైజాం లో కూడా 4కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.