బిగ్ బాస్ 4 ప్రోమోలో గోపి ఎవరో తెలుసా…ఆలస్యం చేయకుండా చూడండి
ఇప్పటికే తెలుగులో మూడు సీజన్స్ పూర్తిచేసుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ నాల్గవ సీజన్ మహమ్మారి కరోనా కారణంగా ఇన్నాళ్లూ నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపులతో పక్కా ప్లాన్ తో తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే హోస్ట్ గా మన్మధుడు నాగార్జున కన్ఫర్మ్ కావడంతో ఇక కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పక్కాగా చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా నిబంధనల నేపథ్యంలో కంటెస్టెంట్ లకు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో ఎంట్రీ ఇప్పించాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందట.
కాగా నాగార్జున పుట్టిన రోజైన ఆగష్టు 29న శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 30 నుంచి రెగ్యులర్‌గా ఈ షోను ప్రసారం చేయాలనే ఆలోచన చేస్తున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, అందులో నాగార్జున కూడా పాల్గొన్నాడు. ఓల్డేజ్ గెటప్ లో బయోస్కోప్ పట్టుకుని దర్శనమిచ్చాడు. ఎవరినో గోపీ అని నాగ్ పిలుస్తున్నాడు. అయితే ఈ ప్రోమో చివరలో తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ ముగించడంతో ఈ గోపీ ఎవరబ్బా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
ఎందుకంటే గత ఏడాది పండు అంటూ సందడి చేసిన నాగ్ ఈసారి గోపి అనే క్యారెక్టర్ ని ఎంట్రీ ఇప్పిస్తున్నట్లు టాక్. ఏదైనా బొమ్మ చూపించి అతడే గోపీ అని చెబుతాడా,ఒకవేళ నిజంగా మనిషిని చూపిస్తారా, లేకుంటే ఏదైనా జంతువుని చూపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో డబుల్ ఫొటోలో మాదిరిగా యంగ్ నాగార్జున ను చూపిస్తారా అనే ఆసక్తికర వాదన కూడా వినిపిస్తోంది. నిజంగా అలా చేస్తే మాత్రం ఫాన్స్ కి మజా గానే ఉంటుంది. ఇక ఓల్డ్ గెటప్ లో మాత్రం నాగ్ అదిరిపోయేలా ఉన్నాడు . అక్కినేని నాగేశ్వర రావు ని గుర్తుచేసాడని అంటున్నారు