Movies

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసమే…అసలు మిస్ కావద్దు

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు 1968ఆగస్టులో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం వేటపాలెం దగ్గర60ఇళ్ళు గల చిన్న గ్రామం నందిగొండ పాలెంలో జన్మించారు. నిరుపేద ఫ్యామిలిలో జన్మించిన వీరిద్దరికి ఓ అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. వ్యవసాయం కుటుంబం కావడంతో చిన్నప్పటినుంచి పొలం పనులు చేసేవారు. రామ్ గొర్రెలను, లక్ష్మణ్ గేదెలను మేపేవారు. దీంతో పాలు, పెరుగు,నెయ్యి వంటివాటికి లోటు ఉండేది కాదు. నాన్నమ్మ వీళ్ళను బాగా గారాభం చేసేది. ఒక సంక్రాంతికి వీరిద్దరికీ ఒకేరకమైన బట్టలు కుట్టిస్తే, ఊళ్ళో వాళ్లంతా బాగాఉన్నాయని అనడంతో అప్పటినుంచి ఇద్దరూ ఒకేరమైన బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఊళ్ళో ఎవరు ఏపని చేసినా వీళ్ళతో చేయించడం,ఎదురు రమ్మనడం అన్నీ సెంటిమెంట్ గా మారాయి. ఇక ఊళ్ళో ఒక రచ్చబండ దగ్గర రాయిని గతంలో ఎవరో కదిలించేవారని విని, తాము కూడా కదిలించాలని ప్రయత్నించి మొత్తానికి ఏడాది పాటు శ్రమించి మొత్తానికి సాధించారు.

ఒకరోజు రచ్చబండ దగ్గర రాయిని కదుపుతామని అంటే, ఊళ్ళో పెద్ద మనుషులు మీవల్ల ఎలా సాధ్యం అన్నారు. దాంతో ఒకరి తర్వాత ఒకరు సునాయాసంగా రాయిని ఎత్తేసారు. ఎలా చేయగలిగారని అడిగితె ఏడాది కాలంగా చేస్తున్న ప్రయత్నం గురించి చెప్పారు. మిలట్రీ సెలక్షన్స్ కోసం లుంగీలతో వెళ్తే రానివ్వలేదు. దాంతో ఊళ్ళో పొలం పనులుచూస్తూ,నాటకాల్లో వేషం కోసం ప్రయత్నించే నానమ్మ రికమండేషన్ మీద లక్ష్మణ్ కి ఒకే డైలాగ్ గల చిన్న పాత్ర ఇచ్చారు. అయితే సినిమా ఫైట్ మాస్టర్ రాజు సంక్రాంతికి కోడిపందేల కు ఆ వూరు వచ్చేవారు. రాజు మాస్టర్ క్రేజ్ గురించి అందరూ చెప్పుకోవడం,వాళ్ళ నాన్న ,వీళ్ళ నాన్న ఫ్రెండ్స్ కూడా కావడంతో రాజు మాస్టర్ ని కల్సి సినిమాల్లోకి వెళ్లాలని రామ్ లక్ష్మణ్ లు ట్రై చేసారు. మొత్తానికి తండ్రి ద్వారా అపాయింట్ మెంట్ పొంది వెళ్లారు. అమాయకులైన రామ్ లక్ష్మణ్ ల గురించి తెలుసుకున్న రాజు మాస్టర్ ఏమోచ్చో చూపించమని అడిగితె కర్రసాము చేస్తూ ముఖానికి దెబ్బలు కూడా తగిలించుకున్నారు.

మీ దగ్గర శిష్యులుగా ఉండాలని అనుకుంటున్నాం అని చెప్పడంతో మద్రాసు వచ్చి కలవాలని రాజు మాస్టర్ సూచించడంతో రెండు ఫాంట్స్ కొనుక్కుని వాటిని ధరించి సర్కార్ ఎక్స్ ప్రెస్ లో మద్రాసు వెళ్లారు. రాజు మాస్టర్ ని కలిసాక ఒకనెల పాటు వ్యక్తిగత పనులు చెప్పి లౌక్యం నేర్పించారు. షూటింగ్ లో రామ్ లక్ష్మణ్ లు చిన్నచిన్న పనులు చేస్తూ ,షూటింగ్ అయ్యాక మాస్టర్ కి ఒళ్ళు,కాళ్ళు పట్టడం చేసేవారు. ఓరోజు శిష్యులకు పార్టీ ఇచ్చిన రాజు మాస్టర్ మందు తాగమని రామ్ లక్ష్మణ్ లకు చెప్పాడు. వాళ్లకు తాగబోమని చెప్పడంతో వెళ్లిపొమ్మన్నాడు. తీరా వెళ్లిపోతుంటే ఆపి,మీకు పరీక్ష పెట్టాను. మీరే నా శిష్యులు అని చెప్పి,పాయసం తాగించారు. మూడేళ్లు రాజు మాస్టర్ దగ్గర పనిచేసి,1989లో ఫైటర్స్ గా యూనియన్ కార్డ్స్ వచ్చాయి. మరో ఏడాది అక్కడే పనిచేసి,సొంతంగా సినిమా యాక్ట్ చేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో వాళ్ళన్నయ్య ప్రతినెలా బియ్యం ,డబ్బులు తెస్తే, జాగ్రత్తగా వాడుకుంటూ అద్దె ఇంట్లో ఉండేవారు.

హీరో సురేష్ ద్వారా ఫైట్ మాస్టర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమూవీ మధ్యలోనే ఆగిపోయింది. 2000లో పూరి జగన్నాధ్ వీరిద్దరికి ఫైట్ మాస్టర్ గా ఛాన్సిచ్చాడు. తర్వాత శుక్ర మూవీ కి సాగర్ దగ్గర పనిచేసినప్పుడే, యాక్షన్ నెంబర్ వన్ అనే కథ చెప్పి హీరోలుగా ఛాన్స్ ఇమ్మని అడిగారు. నిర్మాతను కూడా తీసుకురా వడంతో యాక్షన్ నెంబర్ వన్ మూవీ చేసారు. దీనికి మంచి లాభాలు వచ్చాయి. తర్వాత ఖైదీ బ్రదర్స్, బస్తీమే సవాల్,ఒక్కడేకానీ ఇద్దరు ఇలా ఐదు సినిమాల్లో హీరోలుగా చేసారు. ఇక ఫైట్ మాష్టార్లుగా రాణించాలని ఇడియట్,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, తదితర మూవీస్ చేసారు.

చిరంజీవి,బాలయ్య, వెంకటేష్,నాగార్జున, తారక్,ప్రభాస్ తదితరులకు పనిచేసారు. తర్వాత బోయపాటి మూవీస్ కి చేసారు. ఫాన్స్ ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళచేత విజిల్స్ వేయించేలా ఫైట్స్ కంపోజ్ చేస్తారు. అమ్మా నాన్నలను హైదరాబాద్ రప్పించి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. తండ్రి కాలం చేసారు. ఇక నాగార్జునసాగర్ దగ్గర ధ్యానం క్లాసులకు వెళ్లారు. రోజుకి ఒక్కపూట తింటూ 12గంటలు ధ్యానం చేసారు. ఇప్పుడు ప్రతి ఆరునెలకొకసారి అలావెళ్లి ధ్యానం చేస్తున్నారు.