Movies

RRR లో అలియా భట్ మైనస్సా… ప్లస్సా… రాజమౌళి ఇరుక్కున్నాడా?

జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ గా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వేగంగా షూటింగ్ జరుగుతూనే లాక్ డౌన్ తో ఆగిపోయింది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడు నటీనటులను కూడా జక్కన్న తీసుకున్నాడు. ముఖ్యంగా చెర్రీ పక్కన ఆలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. హిందీలో వెర్షన్ కి ఈమె ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈమె మైనస్ అవుతుందన్న అనుమానాలు వస్తున్నాయ్.

ఏ పాత్ర ఇచ్చిన నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగల ఆలియా భట్ కి అసలు పేరుపెట్టలేం. ఈ కారణంతోనే ఆమెను చెర్రీకి జోడిగా సెలెక్ట్ చేసారు. అయితే సుశాంత్ రాజపుట్ మరణం అలియాకు ఇబ్బందిగా మారిందన్న టాక్ వస్తోంది. సుశాంత్ ని కించపరిచినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ ఐంది. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా మరోవైపు అలియా భట్ తండ్రి మహేష్ భట్ కి సన్నిహితంగా ఉందన్న వార్తలు ట్రోల్ అవుతున్నాయి. మహేష్ భట్ కూతురు నటించిన సడక్ 2ట్రైలర్ రిలీజ్ చేస్తే సుశాంత్ ఫాన్స్ ట్రోల్స్ తో దుమ్మెతిట్టిపోశారు. మూడున్నర లక్షల లైక్స్ వస్తే,70లక్షల డిస్ లైక్స్ వచ్చాయి.

ట్రైలర్ బాగున్నా సరే, సుశాంత్ మరణానికి మహేష్ భట్ కూడా కారణమని భావించిన ఫాన్స్ ఇలా ట్రోల్స్ కురిపించారు. సరిగ్గా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ట్రూప్ కి ఇదే భయం వెంటాడుతోంది. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ చేస్తే డిస్ లైక్స్ వచ్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. నిజానికి బాహుబలి బాలీవుడ్ లో 500కోట్లు కలెక్ట్ చేయగా, ఇప్పుడు డిస్ లైక్స్ వ్యవహారంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ మదనపడుతున్నట్లు టాక్. అయితే రెమ్యునరేషన్ ఇచ్చినా ఇంకా ఆమెతో షూటింగ్ చేయనందున ఈ ముద్దుగుమ్మ ప్లేస్ లో మరొక హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇంకా ఏడాదికి గానీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఛాన్స్ లేనందున అప్పటికీ అన్నీ సర్దుకుపోవచ్చు. అదే అభిప్రాయం ఉంటె అలియా ను కొనసాగించవచ్చు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ కి మొదటి నుంచి ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంది.