Movies

విశ్వనాధ నాయకుడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

ఒకప్పుడు జానపద చిత్రాలకు,చారిత్రాత్మక చిత్రాలకు బాగా గుర్తింపు ఉండేది. ఇంతగా టెక్నాలజీ లేని రోజుల్లో బి విఠలాచార్య జానపద సినిమాలతో ఓ ఆట ఆడించారు. జనంలోకి బాగా కెనెక్ట్ చేసారు. ఇక చరిత్రకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు వచ్చాయి. ఇలాంటి మూవీస్ కి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇక దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ మూవీ హిస్టారికల్ చిత్రమే.ఈ చిత్రాన్ని దాసరి , కృష్ణంరాజు ఆస్థాన ప్రొడ్యూసర్ విజయ మాధవి ప్రొడక్షన్ బ్యానర్‌‌ వడ్డే రమేష్ భారీ ఎత్తున నిర్మించారు.

ఈ చిత్రం విడుదలై 33 యేళ్లు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ,రెబల్ స్టార్ కృష్ణంరాజు, శివాజీ గణేశన్ వంటి అగ్ర హీరోలు నటించిన ఈ మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ ‘విశ్వనాథ నాయకుడు’ పాత్రలో నటించారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు శ్రీకృష్ణదేవరాయులుగా నటించి, ఎన్టీఆర్ తర్వాత వెండితెరపై శ్రీకృష్ణదేవరాయులుగా కృష్ణంరాజు అద్భుత నటన కనబరిచారు. కృష్ణ సరసన జయప్రద , కృష్ణంరాజు సరసన సుమలత, ప్రభ, శివాజీ గణేశన్ సరసన కే.ఆర్. విజయ నటించారు

ఈ చిత్రంలో నడిగర తిలకం శివాజీ గణేశన్ శ్రీకృష్ణదేవరాయులు సైన్యాధిపతి విశ్వనాథ నాయకుడు తండ్రి నాగమ నాయుడు పాత్రలో నటించిన ఈ మూవీ మంచి విజయాన్నే నమోదు చేసింది. 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ కృష్ణ ఈ చిత్రంలో పోషించారు. పైగా కృష్ణ కిది 250వ చిత్రం. శ్రీకృష్ణ దేవరాయలకు సైన్యాధిపతిగా ఉండే నాగమనాయకుడు వెన్నుపోటు పొడిస్తే.. ఆయన కొడుకు విశ్వానాథ నాయకుడు తన తండ్రిని పట్టించి శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించి తనకు తండ్రి కంటే రాజభక్తిలో మిన్న అని చాటిని దేశ భక్తుడి చిత్రం ఇది. ఇక కృష్ణ,శివాజీ గ గణేశన్ కాంబోలో ఈ సినిమానే కాకుండా.. ‘నివురుగప్పిన నిప్పు’, ‘బెజవాడ బెబ్బులి’ వంటి సినిమాలు వచ్చాయి. కృష్ణంరాజు తాండ్రపాపారాయుడు మూవీ కూడా చారిత్రాత్మక చిత్రమే. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా నరసింహారెడ్డి, అంతకు ముందు అనుష్క నటించిన రుద్రమదేవి,బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా హిస్టారికల్ మూవీసే.