ఆర్య సినిమాలో అల్లు అర్జున్ జోడి కట్టిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
ఆర్య సినిమా లో గీత గా నటించిన అనురాధ మెహతా గురించి మనందరికీ తెలుసు. ఆమె ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన నువ్వంటే నాకిష్టం సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన ఆర్య సినిమా హిట్ అయినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో తమిళ, కన్నడ, మలయాళం వైపుకు వెళ్లి హీరోయిన్ గా ట్రై చేసింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. దాంతో సినిమా పరిశ్రమను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. అనురాధ మెహతా సినిమాకి సంబంధించిన ఎటువంటి వేడుకలకు హాజరు కాదు. ఆమె అంతలా సినిమాలకు దూరంగా ఉంది. అందం అభినయం, నటన ఉన్న ఈ తెలుగు అమ్మాయి కి అవకాశాలు రాకపోవడం ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
https://www.chaipakodi.com/