Movies

మంచు మనోజ్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మొదట్లో బాగానే రాణించినప్పటికీ ఆతరువాత వెనకబడ్డాడు. ఇందుకు అతడు ఎంపిక చేసుకున్న సినిమాలు,స్క్రిప్ట్ లు కారణమని విమర్శకుల విశ్లేషణ. చాలా విరామం తర్వాత అహం బ్రహ్మాసి సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని మనోజ్ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే లాక్ డౌన్ వచ్చిపడింది. నిజానికి వ్యక్తిగత జీవితంలో తగిలిన దెబ్బను అధిగమించి తనలోని నటుడిని మళ్ళీ పైకి తెస్తున్నాడు. మొత్తం 17సినిమాలు చేస్తే అందులో ఒకటి హిట్. సెమీ హిట్స్ మూడు,ఏవరేజ్ ఆరు, ప్లాప్ లు 7ఉన్నాయి.

సదా హీరోయిన్ గా 2004లో దొంగ దొంగది మూవీ ద్వారా టాలీవుడ్ లో హీరోగా వచ్చిన మనోజ్ మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ మూవీ మలయాళీ మూవీకి రీమేక్ గా వచ్చింది. 2005లో శ్రీ సినిమా చేస్తే, డిజాస్టర్ అయింది. అదే ఏడాది రాజు భాయి వచ్చింది. అది కూడా ప్లాప్ అవ్వగా,మనోజ్ కి మంచి పేరు వచ్చింది. 2007లో నేను నీకు తెలుసా మూవీతో వచ్చిన మనోజ్ కి నిరాశ తప్పలేదు. జనం రిసీవ్ చేసుకోలేదు. 2008లో ప్రయాణం మూవీ థ్రిల్ గా ఉన్నా ,అప్పట్లో ఆకట్టుకోలేదు. ఇక బిందాస్ గా 2009లో వచ్చిన మనోజ్ కి మంచి హిట్ ఇచ్చింది.

కాగా 2010లో క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన వేదం మూవీ కూడా హిట్ కొట్టింది. 2010లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఝుమ్మంది నాదం మూవీ బిలో ఏవరేజ్ గా నిల్చింది. తర్వాత వచ్చిన మిస్టర్ నూకయ్య ఏవరేజ్. 2012లో బాలయ్య సినిమాలో గెస్ట్ ఎప్పీయరెన్స్ తో వచ్చాడు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా మూవీ ప్లాప్ అయింది. 2013లో వచ్చిన పోటుగాడు హిట్ అయింది. పాండవులు పాండవులు తుమ్మెద అంటూ మంచు ఫ్యామిలీ అందరూ కల్సి నటించిన మూవీ 2014లో వచ్చి ఏవరేజ్ అయింది. అదే ఏడాది తమిళ రీమేక్ కరెంట్ తీగ ఏవరేజ్. ఆతర్వాత దొంగాట ప్లాప్. అలాగే 2016లో సౌర్యం మూవీ ఏవరేజ్. 2017లో గుంటూరోడు మూవీతో ప్లాప్ అయ్యాడు. ఆతర్వాత ఒక్కడు మిగిలాడు మూవీ కూడా ప్లాప్.