Movies

మన స్టార్స్ ఫేవరేట్ ఫుడ్స్ ఏమిటో తెలుసా ?

కొన్ని హోటల్స్ లో టిఫిన్స్,భోజనాలు అదిరిపోతాయి. సెలబ్రిటీలు,ప్రముఖులు కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆ హోటల్ కి వెళ్లి తమకు ఇష్టమైనవి ఆరగిస్తుంటారు. ఇందులో రోడ్ సైడ్ హోటల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కరోనా కారణంగా బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. ఇక అందం, ఆరోగ్యం కోసం మరికొందరు ఇష్టమైన తిండిని కూడా వదిలేసుకుంటు న్నారు. స్లిమ్ గా కనిపించాలని ,యవ్వనంగా ఉండాలని రకరకాల పద్ధతుల్ని పాటిస్తు న్నారు. సూపర్ స్టార్ మహేష్ అయితే బిర్యానీ, చేపల పులుసు రెండింటినీ మెనూలో ఉండాలనుకుంటాడు. కానీ.. అందం ఆరోగ్యం కోసం పరిమితుల దృష్ట్యా వాటిని శృతిమించకుండా అదుపులో ఉంచుకుంటు న్నాడట. తన వ్యక్తిగత డైటీషియన్ సూచించిన విధంగా కఠినమైన డైట్ పాటిస్తాడు వ్యాయామాలు చేసి కేలరీలను బర్న్ చేయడం ద్వారా అదుపులో ఉంచుతాడట.

మద్రాస్ లో షూటింగులకు వెళ్లే రోజుల్లో రోడ్ సైడ్ కాకా హోటల్ ఫార్ములానే అయినా బాగా వర్కవుటైంది. ఆ దోసె ఎంతో రుచిగా ఉండేదట. ఆరోగ్యానికి అందానికి మంచిదని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసింది. ఆ తర్వాత దానినే ఇంట్లో ట్రై చేశారు. ఫార్ములా వర్కవుటయ్యాక చట్నీస్ లో స్పెషల్ మెనూలో పొందుపరిచారు. ఇప్పటికీ చెన్నయ్ స్టార్లు హైదరాబాద్ కి వస్తే, చట్నీస్ కి వెళ్లి మరీ చిరంజీవి దోసె తిని వెళతారు. అంతేకాదు,చిరు ఇంటికే వెళ్లి దోసె కావాలని అడిగి మరీ తినే ఫ్రెండ్స్ సరేసరి. మెగా ఫ్యామిలీ స్టార్లు అందం కోసం ఆరోగ్యం కోసం ఇలాంటివి చాలా చేస్తుంటారు. ఇక అక్కినేని వారి కోడలు సమంత అయితే హాట్ ఫిల్టర్ కాఫీ .. స్వీట్ పొంగల్ ను ఇష్టపడుతుంది. కూరగాయల వంటకాలు.. సాంబార్ రైస్ ఇష్టపడుతుంది. ఆమె ప్రస్తుతం వంటగదిలో కొత్త వంటకాలను ప్రయత్నిస్తోంది. ఆరోగ్యం, అందం కోసం కొన్నిటిని ఆల్టర్నేట్ చేస్తుంటుంది.

అలు పరోటా.. గులాబ్ జామున్ వంటి పంజాబీ రుచుల్ని బాగా తినే అందాల భామ రకుల్ ప్రీత్ బరువు పెంచే వాటిని దూరంగా పెట్టి, అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం జిమ్ కి వెళ్తుంది. అమ్మమ్మ చేతివంట అంటే రానాకు చాలా ఇష్టం. ఆమె చేసే సాంబార్ ను చాలా ఇష్టపడతాడు. అతను పాఠశాల నుండి వచ్చిన తరువాత తన అమ్మమ్మ తయారుచేసిన సాంబార్ వాసన ఎలా ఇష్టపడేవాడో, ఇడ్లీలు/ దోసలతో సాంబార్ ఎలా తినేవాడో ఇప్పటికీ మర్చిపోలేదని చెబుతాడు. హైదరాబాదీ బిర్యానీ.. హలీమ్ అంటే చాలా ఇష్టమైనప్పటికీ అందం ఆరోగ్యం కోసం నోరు కట్టేసుకుంటున్నాడు. పైగా కఠినమైన డైట్ పాటిస్తున్నాడు. ముఖ్యంగా తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆహారం రెడీ చేస్తారట. ఇంకా పలువురు స్టార్స్ అయితే ఇవేవీ పట్టించుకోకుండా తమకు ఇష్టమైన వాటిని ఇష్టమైన చోట ఆరగిస్తూ తమ స్టైల్లో అందాన్ని కాపాడుకుంటున్నారు.
https://www.chaipakodi.com/