Movies

మెగా హీరోలు రీమేక్ ల వెంట ఎందుకు పడుతున్నారో తెలుసా ?

ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ లు ఎప్పటినుంచో వున్నా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఇతర భాషా చిత్రాల్లో హిట్ కొట్టిన మూవీలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. వీరిలో మెగా హీరోలు ముందున్నారని అంటున్నారు. యువ హీరోలు సరైన స్టోరీ దొరక్క ఇబ్బంది పడుతుంటే, మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ లను ఎంచుకుంటున్నారు.

రాజకీయాల నుంచి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నిజానికి పూరి జగన్నాధ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ తమిళంలో హిట్ కొట్టిన కత్తిని రీమేక్ చేసి ఖైదీ నెంబర్ 150తో మెగా హిట్ అందుకున్నాడు. తర్వాత సైరా,ఆచార్య స్ట్రైట్ మూవీస్ చేస్తున్నా,మరోసారి మలయాళ మూవీ లూసిఫెర్ ని రీమేక్ కోసం ఎంచుకున్నాడు. ఇక్కడ నేటివిటీ కి తగ్గట్టు డైరెక్టర్ సుజిత్ కథపై కసరత్తు చేస్తున్నాడు. అలాగే తమిళ మూవీ వేదాళం రీమేక్ లో కూడా మెగాస్టార్ చేస్తాడని టాక్.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, హిందీలో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ సినిమా రీమేక్ గా వకీల్ సాబ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక మలయాళ మూవీ అయ్యప్పన్ కోషియం మూవీ చాలామంది చుట్టూ తిరిగి పవన్ దగ్గరికి చేరింది. ఇది మల్టీస్టారర్ కావడంతో మరోసారి వెంకటేష్ తో కల్పి చేస్తాడని టాక్. ఇక ఆమధ్య ధ్రువ తో రీమేక్ మూవీ చేసిన రామ్ చరణ్ రెండేళ్లుగా ఆర్ ఆర్ ఆర్ తో బిజీగానే ఉన్నాడు. ఇక రెండు రీమేక్స్ కూడా రెడీగా పెట్టాడట.