అటవీ నేపధ్యంలో సినిమాలు తీయటం సేంట్ మెంట్ అయిందా ?
అడవుల్లో సినిమా తీయాలంటే దానికి ప్రత్యేక కారణం ఉండాలి. అటవీ నేపధ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే సినిమాకు అంతగా అతకవు. అందుకే అడవి నేపధ్యం ఉండేలా సినిమా కథలు రాస్తున్నారు. నిజానికి స్వాతంత్ర్య సమరవీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా అంటేనే అడవి నేపధ్యం అని ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ నక్సలైట్ సినిమా ఆయన అడవి తప్పనిసరి. గంధపు చెక్కల స్మగ్లింగ్ ,వాళ్ళని పట్టుకునే ఆఫీసర్స్ ఇలా సాగిపోయే సినిమాకు కూడా అడవి ఉండాల్సిందే. ఇక గిరిజనులతో అనుబంధం ఉండే అధికారులు,మనుషులు ఉంటారు. అవీ కథలుగా తెరకెక్కాయి. ఒకప్పుడు నందమూరి తారక రామారావు హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అడవి రాముడు చిత్రం పేరులోనే అడవి ఉంది.
కృష్ణ ,కృష్ణంరాజు నటించిన అడవి సింహాలు,మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ కూడా అటవీ నేపధ్యమే. ఆర్ నారాయణమూర్తి నటించిన అర్ధరాత్రి స్వాతంత్య్రం మూవీ నక్సల్ నేపధ్యం కారణంగా అడవిలోనే తీశారు. సినిమాలో కథ రీత్యా వెంకటేష్ నటించిన బొబ్బిలిరాజా, నాగార్జున నటించిన అరణ్య కాండ, అంతకుముందు చిరంజీవి నటించిన ఖైదీ, అలాగే కృష్ణ శోభన్ బాబు నటించిన మహా సంగ్రామం ఇలా చెప్పుకుంటూ పొతే అడవిలో షూటింగ్ చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. నిజానికి అడవిలో షూటింగ్ అంటే రిస్క్ ఎక్కువే. క్రూర మృగాలు,వర్షం వస్తే ఇబ్బంది,చీకటి పడితే బయటకు రావాలి,ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో అడవుల్లో షూటింగ్స్ కి సినిమా వాళ్ళు పెద్దగా ప్రయార్టీ ఇవ్వడంలేదు.
అయితే మళ్ళీ ఇప్పుడు అడవి నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా అడవిలో షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు,కొమరం భీం లను కలిపే విధంగా తీస్తున్న సినిమా ఇది. అంతేకాదు, బన్నీ నటిస్తున్న పుష్ప సినిమాలో అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యమే. ఇక విరాట పర్వం పేరిట వేణు ఊడుగుల డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ పాత్ర వేస్తోంది. ఇక రానా చేస్తున్న అరణ్య మూవీ,అలాగే క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ తేజ్ రెండో సినిమా కూడా అడవిలోనే దాదాపు 40రోజుల షూటింగ్ చేశారట. అడవి నేపథ్యంలో తీసే ఈ సినిమాలన్నీ హిట్ అయితే మళ్ళీ అందరూ అడవి బాట పెడతారేమో.