Movies

హీరో సిద్ధార్ధ్ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సిద్ధార్ధ్ హీరోగానే కాదు,సింగర్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అసలు పేరు సిధార్థ సూర్యనారాయణ. శంకర్ సినిమా బాయ్స్ మూవీలో ఛాన్స్ దక్కడంతో నటుడిగా అవతారం ఎత్తాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో హీరోగా కెరీర్ మలుపు తిరిగింది. ఇక బొమ్మరిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

తెలుగు,తమిళ్,హిందీ లలో నటించి ఉత్తమ నటుడిగా బెస్ట్ హీరోగా పేరుతెచ్చుకున్న సిద్ధార్ధ్ ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయింది. వరుస ప్లాప్ లతో కెరీర్ దెబ్బతింది. 2003లో పెళ్లి చేసికుని ఓ ఇంటివాడిగా సెటిలయిన సిద్ధార్ధ్ 2007లో విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

కొత్త గెటప్ ,కొత్త సినిమాతో సిద్ధార్ధ్ మళ్ళీ వస్తాడని అందరూ ఆశించినప్పటికీ ఎక్కడో తేడా జరిగింది. సిద్ధార్ధ్ ప్లేస్ లో వరుణ్ సందేశ్ వచ్చాడు. అయితే కొన్ని మూవీస్ తర్వాత వరుణ్ కూడా తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇలా చాలామంది యంగ్ హీరోలు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. మరి సిద్ధార్ధ్ మంచి నటుడే కాకుండా సింగర్, దర్శకుడు కూడా అయినప్పటికీ కెరీర్ ఆగిపోయింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు మళ్ళీ ఎప్పుడొస్తాడా అని కొందరు ఎదురుచూస్తున్నారు.