Movies

హిట్లర్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…మీకు తెలుసా ?

బిగ్ బాస్,రిక్షావోడు,ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలు పెద్దగా ఆడకపోవడం,మెగాస్టార్ ఫిలిం వచ్చి ఏడాది అయిపోవడంతో ఫాన్స్ లో ఒకటే ఆరాటం. చిరు పనైపోయిందన్న కామెంట్స్ వస్తుంటే అభిమానులకు తట్టుకోవడం కష్టంగా ఉంది. మరోవైపు బాలయ్య, వెంకీ, నాగ్ వంటి సాటి హీరోల సినిమాలు హిట్ మీద హిట్ కొట్టేస్తున్నాయి. సరిగ్గా అదే టైమ్ లో ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో ఎడిటర్ మోహన్ మూవీ ప్రకటన రావడంతో ఫాన్స్ లో మళ్ళీ నిరాశ. బడ్జెట్ మూవీ కాదు,పైగా మలయాళీ మూవీకి రీమేక్. అందుకే ఇలాంటి కథ ఎంచుకున్నాడేంటని ఫాన్స్ లో ఆందోళన. పైగా టైటిల్ కూడా హిట్లర్ అని పెట్టడంతో ఫాన్స్ లో అనుమానం మరింత హెచ్చింది.

ఇలా ఫాన్స్ ఆందోళన పడుతుంటే సాంగ్స్ ఆడియో కేసెట్ రిలీజ్ అయింది. అందులో ముఖ్యంగా వేటూరి రాసిన నడక కల్సిన నవరాత్రి సాంగ్ తో ఫాన్స్ లో ఖుషి. ఈ పాటకు చిరు డాన్స్ ఎలా ఉంటుందా అని ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఇక జేసుదాసు పాడినపాట కూడా బాగుంది. అప్పట్లో జేసుదాసు పాట ఉందంటే ఆ సినిమా హిట్ అనే ముద్ర కూడా బలంగా పడింది. 1997జనవరి 4న హిట్లర్ రిలీజ్. ఫైట్లు తక్కువ, ఏడుపు ఎక్కువ, సెకండాఫ్ దాసరి డామినేషన్ ఇలా డివైడ్ టాక్స్. తొలిరోజు నాలుగు ఆటలు అయ్యేసరికి సూపర్ హిట్ టాక్. సిస్టర్స్ ని ఎవరైనా ఏమైనా అంతేచాలు రఫ్ ఆడించడం,మరదలు ఎంతకవ్వించినా పెద్ద తరహాగా ఉండడం ఇవన్నీ జనానికి బాగా నచ్చాయి.

హిట్లర్ మాధవరావు గా ఆడియన్స్ కి చిరు దగ్గరయ్యాడు. హీరోయిన్ రంభ,హీరో తండ్రిగా దాసరి,బాలుగా రాజేంద్రప్రసాద్, మాధవరావు చెల్లెళ్లుగా అశ్విని,మోహిని,మీనా కుమారి,గాయత్రీ అప్పలకొండ గా బ్రహ్మానందం, సుధాకర్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. దాసరితో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక మూవీయే కాదు, ప్రకాష్ రాజ్ తో కల్సి చేసిన తొలిసినిమా కూడా ఇదే. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎల్బీ శ్రీరామ్ రాసిన డైలాగ్స్ హృదయాన్ని తాకాయి. ఇక లారెన్స్ కొరియోగ్రాఫర్ గా కంపోజ్ చేసిన డాన్స్ కి అనుగుణంగా చిరు చేసిన డాన్స్ ఫాన్స్ ని సీట్లలో కూర్చోనీయలేదు. వారం రోజులు తిరిగేసరికి మూవీ బ్లాక్ బస్టర్. 42సెంటర్స్ లో వంద రోజులు ఆడిన ఈ మూవీ తో చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అంతలా ముత్యాల సుబ్బయ్య కన్నీటి సెంటిమెంట్ పండింది.
https://www.chaipakodi.com/