Movies

ఓటిటి ప్లాట్ ఫార్మ్ పై సినీ సందడి…. చూడకపోతే వెంటనే చూసేయండి

కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో ఓటిటి లో ఎన్నో సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్,ఆహా వంటి ప్లాట్ ఫార్మ్స్ మీద తమిళం,మలయాళం ,కన్నడం ఇలా పలు సినిమాలు రిలీజవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కాకున్నా సరే, పాత్రల తీరు,కంటెంట్ వంటి విధానాల వలన నెట్ లో ఈ సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. ఫ్రెంచ్ బిర్యాని మూవీ లో బెంగుళూరులో అఫ్జర్ అనే ఆటో డ్రైవర్ రెండు రోజులపాటు జర్నీ చేసే ఇతివృత్తం.

ఇక మహానటి సినిమా చూడకపోతే నెట్ లో చూసే ఛాన్స్ వచ్చేసింది. సావిత్రి పుట్టిన నాటినుంచి మరణించే దాకా ఆమె జీవితంలో జరిగిన అనేక ఘటనలను ఇందులో చూపించారు. కీర్తి సురేష్ నటన సూపర్భ్ . ఇక వైరస్ మూవీలో రకరకాల వైరస్ ఎలా విజృంభిస్తున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పడుతున్న ఇబ్బందులు కనిపిస్తాయి. గ్రిప్పింగ్ మర్డర్ మూవీ శివాజీ సరతలై మూవీలో శివాజీ అనే ఆఫీసరు మర్డర్ చేయడం ఇతివృత్తం తో సాగిన ఈ సినిమా బాగానే ఉంది. అంగమలై డైరీస్ మూవీ కూడా ఇందులోనే కల్పి చూపిస్తారు.

కొంతమంది వలసదారులు తాము చేయని పనికి దోషులుగా చెప్పుకుంటారు. వారిని ఓ పోలీసు వేధిస్తాడు. దాంతో వాళ్ళు మరింత చిక్కుల్లో పడతారు ఆ నేపథ్యంలో తీసిన నిశారనై మూవీ. సముద్ర ఘోష్ నటన చూసి తీరాలి. నాలుగు కథలతో అనేక మలుపు లతో తిరిగే సినిమా సూపర్ డీలక్స్. విజయ సేతుపతి,సమంత నటన సూపర్భ్ . ఉయ్ రే మూవీ లో ఆసరా బాధితురాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో చూపించే మూవీలో పల్లవి క్యారెక్టర్ అదిరిందని అంటున్నారు. ఇక బాహుబలి నిర్మాతలు తీసిన సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ మంచి టాక్ అందుకుంది. ఒక ఫోటోగ్రాఫర్ తన పని తానుచేసుకు పోతుంటే ఎదురైన సంఘటనతో ఎందుకు ఉగ్రరూపం దాల్చడనే ఇతివృత్తంగా అందంగా మలిచారు. సత్యదేవ్ నటన, కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా ప్రతిభకు ఇది అడ్డం పడుతోంది.