ఒకప్పటి ఈ హీరో గుర్తున్నాడా…?ఇతని కూతురు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా?
మలయాళం ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి,హీరోగా ఓ ఊపు ఊపేసిన అతడు తర్వాత తమిళం,అనంతరం తెలుగులోకి ఎంటర్ అయ్యి సత్తా చాటాడు. స్టార్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ యాక్టర్ గా తెలుగులో నటిస్తూ అందరిని అలరిస్తు న్నాడు. అతనెవరంటే ,చిన్నారి స్నేహమా అనే సాంగ్ లో కనిపించే హీరో రఘు. ఇతడి అసలు పేరు వర్శిన్ రెహ్మన్.
భారత్ బంద్, రాసలీల,సమరం,రేపటి రౌడీ,ఆలయం, గోవిందుడు అందరి వాడేలే, జనతా గారేజ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా రఘు మంచి గుర్తింపు తెచ్చుకున్న్నాడు. యితడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మన్ కి అన్నయ్య అవుతాడు. వీరిద్దరూ తోడల్లుళ్లు. వీరిద్దరి భార్యలు స్వయానా అక్కా చెల్లెళ్ళు.
ఇక రఘు కి గల ఇద్దరు కూతుళ్ళల్లో ఒక కూతురు సినిమా రంగంలోనే ఉంది. రషితా రెహ్మన్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో చేసింది. ఈమె మలయాళంలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇలా సినిమా రంగాన్ని ఈ ఫ్యామిలీ ఏలేస్తోంది.