సంతూర్ యాడ్ లో మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ పాప ఎవరో తెలుసా ?
నిత్యం టీవీల్లో చాలా యాడ్స్ వస్తాయి. అందులో సంతూర్ సోప్ ప్రకటన ఒకటి. ఇందులో మమ్మీ అంటూ క్యూట్ గా అందరినీ అలరించే పాప ఉంటుంది. కోల్గేట్ యాడ్ లో కూడా ఈ అమ్మాయి చాలా ఫేమస్ అయింది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిత్యా పేరుతొ పాపులర్ అయిన ఈ పాప పేరు నిత్యా మోయల్.
మహారాష్ట్రలోని ముంబయిలోజులై 18న జన్మించిన నిత్యా నిత్యా స్టడీస్ చేస్తూనే చాలా యాడ్స్ లో చేస్తోంది. సంతూర్ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కల్సి నటించి మంచి పేరు తెచ్చుకుంది. కార్తీతో తమిళ్, వరుణ్ దేవ్ తో హిందీ లలో కూడా సంతూర్ యాడ్స్ లో చేసింది. బ్రూక్ బ్యాండ్ యాడ్ లో చేసింది.
షారూఖ్ ఖాన్ తో కల్సి ఓ యాడ్, సోనూసూద్ తో మరో యాడ్ లోనూ నిత్యా నటించింది. ఫియోనా వాయించడం, చెస్ ఆడడం ఈమెకు చాలా ఇష్టం నిత్యా కు దేవ్ మోయల్ అనే ఓ అన్నయ్య ఉన్నాడు. ఎన్నో యాడ్స్ లో చేసిన దేవ్ ఆతర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కల్సి ఓ యాడ్ లో చేసాడు. నిత్యా తండ్రి హరీష్ మోయల్ ప్లే బ్యాక్ సింగర్. తల్లి నీలూ మోయల్ గృహిణి.