Movies

ఠాగూర్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో ?

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని రెండు కాదు మూడింతలు చేసిన సినిమా ఠాగూర్. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని పార్టీలు భయపడేలా ఈ సినిమా ప్రభంజననం సృష్టించింది. ఎన్టీఆర్ కి సర్దార్ పాపారాయుడు ఎలాగో చిరుకి పొలిటికల్ ఎంట్రీకి ఠాగూర్ స్ఫూర్తి అని చెప్పాలి. ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, ఆస్కార్ రవిచంద్ర,ప్రొడ్యూసర్ మధు దగ్గరకు వచ్చి ఓ కుర్రాడు కథ చెప్పాడు. ఆ కథ వింటున్నంతసేపు మధుకి ఈ మూవీ చిరంజీవికి అయితే బాగుంటుందని అనుకుంటు న్నాడు. కానీ తమిళం కదా. అది విజయకాంత్ కోసం రాసిన కథ. ఆ కుర్రాడు ఎవరో కాదు ఏ ఆర్ మురుగుదాస్. టైటిల్ రమణ. అయితే మధు హైదరాబాద్ వచ్చిన వెంటనే చిరంజీవిని,ఆతర్వాత అల్లు అరవింద్ ని కల్సి సంగతి చెప్పాడు. మురుగుదాస్ తమిళంలో చేసే మూవీని తెలుగులో చిరుతో బాగుంటుందని,అందుకే మిస్ కావద్దని చెప్పాడు. రోజులు ,నెలలు గడిచాక రమణ విడుదలై తమిళంలో సూపర్ హిట్ కొట్టింది. తెలుగు రైట్స్ కోసం ఎవరి రేంజ్ లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరోపక్క డాక్టర్ రాజశేఖర్ రేసులో ఉన్నాడు. స్పెషల్ షో వేయించుకుని మరీ చిరు చూడ్డంతో బాగా నచ్చేసింది.

ఇంద్ర తర్వాత ఇలాంటి మూవీయే కావాలని చిరు అనుకోవడమే తరువాయి మధు రంగంలోకి వచ్చి రైట్స్ తెచ్చేసాడు. ఇక పరుచూరి బ్రదర్స్ అంటే చిరుకి గురి కావడంతో తెలుగు వెర్షన్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే మురుగుదాస్ ని డైరెక్టర్ గా పెడితే నేటివిటీ పోతోందని,బి గోపాల్ ని ఆలోచన చేసారు. అయితే మాస్ పల్స్ తెల్సిన వివి వినాయక్ వైపు మొగ్గారు. అప్పటికే దిల్ షూటింగ్ లో ఉన్న వినాయక్ దగ్గరకి రాజారవీంద్ర వెళ్లి తీసుకొచ్చాడు. తమిళంలో రమణ మూవీ చూసావా అని చిరు అడగడం,చూశానని వినాయక్ చెప్పడం,అయితే నువ్వే డైరెక్ట్ చేయాలని చిరు చెప్పేయడం చకచకా జరిగిపోయాయి. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్,కెమెరా మెన్ గా చోటా కె నాయుడు కన్ఫర్మ్. తక్కువ బడ్జెట్ లోనే చేద్దామని ప్రొడ్యూసర్ మురళికి చెప్పేసాడు చిరంజీవి. అన్నీ కుదిరాయి. హీరోయిన్ గా మాధురి దీక్షిత్ అనుకుంటే ప్రెగ్నెన్సీ. దాంతో జ్యోతిక ను సెలెక్ట్ చేసారు. మరో హీరోయిన్ శ్రేయ. లారెన్స్ కొరియోగ్రాఫర్ గా వచ్చాడు. కొడితే సిక్స్ కొట్టాలి అన్నాడు. దాంతో కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి పల్లవి చంద్రబోస్ కి వచ్చేసింది.

రుద్రవీణలో బ్యాక్ డ్రాప్ వాడిన నేను సైతం లైన్ ని సీరియస్ పాటలో వాడాలని నిర్ణయం తో సుద్దాల అశోక్ తేజతో రాయించి ఎస్పీ బాలుతో పాడించారు. మొత్తం పాటలన్నీ ముందే రికార్డింగ్ చేసారు. ఇక టైటిల్ ఏమిటనే తర్జన భర్జనలో ఖైదీల్లో చిరు పేరు సూర్యం కదా అదే పెడదామన్న సూచన. అయితే పరుచూరి వెంకటేశ్వరరావు ఠాగూర్ టైటిల్ అనడంతో అదే ఒకే అయింది. వినాయక్ కి ఇష్టమైన హీరో,ఇష్టమైన కథ, ఇష్టమైన టీమ్. 100పనిదినాల్లో షూటింగ్ పూర్తి. రాజమండ్రిలో మథర్ థెరిస్సా విగ్రహం ఓపినింగ్ సందర్బంగా అక్కడ క్లైమాస్క్ తీయాలని ప్లాన్ చేస్తే, అడుగుపెట్టడానికి వీలులేని జనంతో కుదరలేదు. దాంతో తిరుపతిలో తీస్తే ఏర్పాట్లు చేస్తానని ప్రొడ్యూసర్ ఎంవి ప్రసాద్ చెప్పడంతో పక్కా ఏర్పాట్లతో సక్సెస్. తమిళ వెర్షన్ లో హీరోకి ఉరి పడుతుంది. తెలుగులో కుదరదు కదా. మురుగుదాస్ కూడా సెట్ లోకి వచ్చేసాడు. తర్జనభర్జనలు. హైకోర్టు జడ్జిని కల్సి వినాయక్ సలహా తీసుకున్నాడు . ఆవిధంగా హీరోని బతికించే సీన్ వచ్చేసింది. 2003సెప్టెంబర్ 24న 605థియేటర్లలో రిలీజ్. తొలిఆటకే హిట్ టాక్. పవన్ సినిమా చూసి అన్నయ్య నీ నుంచి ఇలాంటి మూవీస్ రావాలి అని కామెంట్.