Movies

ఆచార్య,పుష్ప సినిమాలకు ఒకే రకమైన సమస్య వచ్చిందట…అయ్యో పాపం ?

ఏదైనా సినిమా తీస్తుంటే,ఈ కథ నాదే కాపీ కొట్టారు … వంటి సంఘటనలు ఎప్పటినుంచో వింటున్నాం. అందుకే డబ్బింగ్ లు,రీమేక్ లు వచ్చేసాయి. ఒకే కథతో రెండు సినిమాలు కూడా ఒకేసారి వచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఒకటి రీమేక్,మరొకటి రీమేక్ కి కాపీ … ఇక రీమేక్ హక్కుల కోసం గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. టైటిల్ కోసం కోర్టులకెక్కిన సీన్స్ ఉన్నాయి. ఇక తెలుగులో ఏ సినిమా వచ్చినా ఇదే పలానా దానికి కాపీ అని చెప్పేయడం,కామెంట్స్ ఎప్పుడూ ఉన్నదే. అంతెందుకు పాటపాటలకు రీమిక్స్,పాత సినిమా కథలనే అటూ ఇటూ మర్చి సినిమాలు తీయడం కూడా తెల్సిందే. ఏదోఒక సందర్బంలో రగడ సహజమే.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్న సినిమాలపై ఒకే సమయంలో రగడ కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. అలాగే మెగా మేనల్లుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ సుకుమార్ డైరెక్షన్ లో తీస్తున్నారు. ఇప్పుడీ రెండు మూవీస్ కథల విషయంలో కాపీ కొట్టారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా వచ్చింది. అందులో ఫైట్,ధర్మస్థలి అనేపేరు తాను రాసుకుని,రిజిస్టర్ చేసుకున్న కథలో ఉన్నవేనని మండూరి రాజేష్ అనే రచయిత ఆరోపిస్తున్నారు. మెగాస్టార్ మూవీ కావడంతో సహజంగానే ఇది హాట్ టాపిక్ అయింది. దీనిపై ఆచార్య టీమ్ తాజాగా వివరణ ఇస్తూ ప్రకటన రిలీజ్ చేసింది.

ఇక బన్నీ నటిస్తున్న పుష్ప మూవీ కి సంబంధించి తాను రాసిన కథలో ఛాయలు ఉన్నాయని వేంపల్లి గంగాధర్ అనే రైటర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఎర్ర చందనం కాన్సప్ప్ట్ తో గతంలో రాసిన కథ వివరాలను ,పుష్ప సీన్స్ ప్రస్తావిస్తూ ఆయన ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ మూతపడింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. అలాంటి సమయంలో ఈ సిన్మాలు పూర్తికాకుండానే వాటిల్లో ఏమున్నాయో చూడకుండానే ఈ కథలు తమవేనని చెప్పుకోవడం తగదని మెగా ఫాన్స్ అంటున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ మూవీ విషయంలో వేంపల్లి గంగాధర్ ఇలానే పోరాడి, సరైన సాక్ష్యాలు చూపించినట్లు వార్తలొచ్చాయి. కానీ పుష్ప మూవీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో రగడ రావడం హాట్ టాపిక్ అయింది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.