మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతానికి దూరం కావటానికి కారణం ఎవరో తెలుసా ?
క్రియేటివ్ డైరెక్టర్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ అంటేనే అదో క్రేజ్ అన్నట్లు సాగిపోయింది. ఆర్పీ సంగీతానికి బ్రాండ్ ఇమేజ్ గా మారాడు. చిత్రం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఆతర్వాత నువ్వు నేను ,జయం లాంటి ఎన్నో హిట్ సినిమాలు చేసారు. నువ్వు నేను మూవీలో గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం కాదా అనే సాంగ్ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చింది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోతెక్కించింది. ఇక నీ స్నేహం అనే మూవీలో కూడా సుమధుర గీతాలను అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ ఇంద్ర మూవీలో ఒక సాంగ్ అర్జెంట్ గా కావాల్సి వస్తే,మణిశర్మ అందుబాటులో లేకపోతె ఆర్పీ ఆలోటుని భర్తీ చేసాడు. శ్రీరామ్,హోలీ, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో పాటు నాగార్జున నటించిన సంతోషం మూవీకి కూడా సంగీతం అందించాడు. హీరోగా అంధుని పాత్రలో మెప్పించిన ఆర్పీ ఆతర్వాత సడన్ గా సంగీతానికి దూరం అయ్యాడు. వి ఎన్. ఆదిత్య డైరెక్షన్ లో నాగార్జున నటించిన నేనున్నాను మూవీలో సంగీత దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు రెండు సాంగ్స్ రికార్డింగ్ అయ్యాక ,యుఎస్ లో ఓ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు వెళ్ళాడు. దాంతో ఇక్కడ కొన్ని కీలకమైన సినిమాలు మిస్ అయ్యాడు.
యుఎస్ నుంచి వచ్చిన ఆర్పీ దగ్గరకు ఇండస్ట్రీలోని ఓ పెద్దాయన వచ్చి ,నీ వలన సినిమా బిజినెస్ మీద ప్రభావం పడుతోందని అన్నారట. అంతేకాదు,నేనున్నాను మూవీ నుంచి తప్పించేస్తున్నట్లు కూడా చెప్పేసారు. ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ విషయం నాగార్జునకు కూడా తెలీదట. దీంతో తన సంగీతం వలన బిజినెస్ మీద ప్రభావం చూపిస్తోందా అని భావించిన ఆర్పీ అక్కడ నుంచి సంగీతానికి దూరమయ్యాడు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో గానీ మ్యూజిక్ కి లాంగ్ బ్రేక్ తీసుకునేంతలా ఆర్సీని బాధించిందంటే ఆశ్చర్యంగానే కాదు,మిస్టరీ కూడా.