జక్కన్న సినిమాల్లో విలన్స్ ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దామా ?
సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. పవర్ ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరోయిజాన్ని చూపించొచ్చన్నది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి శైలి. అందుకే అతడి సినిమాల్లో విలన్స్ వైరెటీగా ఉంటారు. పవర్ ఫుల్ గా కనిపిస్తారు. బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ ని సై మూవీలో ఎంట్రీ ఇప్పించాడు. ఆ మూవీలో అతడి ఆహార్యమే భయంకరంగా ఉంటుంది. దాంతో సౌత్ లో విలన్ దూసుకెళ్లి ,తర్వాత కమెడియన్ రోల్స్ లో కూడా రాణిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెకండ్ మూవీ మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జక్కన్న ఆ మూవీలో దేవ్ ని విలన్ గా పరిచయం చేసాడు. కృష్ణార్జున మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మగధీర మూవీతో ఈ బాలీవుడ్ నటుడు టాప్ విలన్ గా మారిపోయాడు.
ఈగ మూవీతో కన్నడ హీరో సుదీప్ ని విలన్ గా జక్కన్న ఎంట్రీ ఇప్పించాడు. డైరెకర్,సింగర్,ప్రొడ్యూసర్, హోస్ట్ కూడా అయిన సుదీప్ ని విలన్ గా మెప్పించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా, ఒకటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన అజయ్ ని విక్రమార్కుడులో టిట్లా పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నాడు. జక్కన్న ఎంట్రీ ఇప్పించిన సాఫ్ట్ విలన్ నాగినీడు. సునీల్ ని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తూ తీసిన మర్యాద రామన్న మూవీలో నాగినీడు పాత్ర బాగా ఆకట్టుకుంది. ఇక సుప్రీత్ ఎన్ని సినిమాలు చేసినా,ఛత్రపతి మూవీలో కాట్రాజు పాత్ర ఎక్కువగా గుర్తుండిపోతుంది. నిజానికి ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలక్ట్ చేసిన సుప్రీత్ ని ఆతర్వాత కాట్రాజు పాత్రకు మార్చారు. జక్కన్న సినిమాల్లో సుప్రీత్ కనిపిస్తూ ఉంటాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ప్రభాకర్ కి రాజమౌళి తన మూవీస్ లో మెయిన్ పాత్రలిచ్చాడు. మర్యాద రామన్న మూవీలో విలన్ గా కన్పించి,బాహుబలి మూవీలో కాలకేయ ఛాన్స్ కొట్టేసాడు. ఆ సినిమా అతడికి మంచి పేరు తెచ్చింది. నటుడు రానాను బాహుబలి మూవీలో భల్లాల దేవ అనే నెగెటివ్ షేడ్ లో చూపించి మెప్పించేలా చేసాడు. హీరో ప్రభాస్ తో పోటీ పడి నటించాడు. అందుకే రాజమౌళి విలన్స్ కి ప్రత్యేకత ఉందని అందరూ అనేమాట.