Movies

నాగ్ నటించే వైల్డ్ డాగ్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయట…ఏమిటో తెలుసా ?

ఆగస్ట్‌ 29న పుట్టిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 60 ఏళ్లు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇప్పటికీ కూడా నాగ్ వయసు 60 ఏళ్లు దాటాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక పుట్టినరోజు సందర్బంగా నాగార్జునకి అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నాగ్ నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీ పోస్టర్‌నుచిత్ర బృందం విడుదల చేసింది.ఈ పోస్ట‌ర్ అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. నాగార్జున 98మూవీస్ చేయగా ఇలా పోస్టర్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన తొలిసినిమా ఇదే. పైగా పాటలు ఉండవట.

నిన్నే ప్రేమిస్తా, అధిపతి,కృష్ణార్జున మూవీస్ లో అతిధి పాత్రలు వేసినా, అందులో కూడా నాగ్ కి పాటలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అహిసార్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తయింది. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇంకా సెట్స్ మీదికి రావాలి. అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

ఈ చిత్రలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తుండంగా, ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగ్‌ లుక్‌ ఆసక్తిని కలిగిస్తోంది. అతనికి సహాయకులుగా మరో ఐదుగురు అధికారులు నటిస్తున్నారు. అందులో ఓ లేడీ ఆఫీసర్ కూడా ఉంది. దియా మీర్జా ఈ మూవీలో నటిస్తోన్న నేపథ్యంలో నాగ్ కి జోడీ గా హీరోయిన్ లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ 4వ సీజన్ కి హోస్ట్ గా రెడీ అయినందున అది పూర్తయ్యేవరకూ ఈ మూవీ సెట్స్ మీదికి రాకపోవచ్చు.