Movies

RRR లో రాజమౌళి ఎవరిని హైప్ చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతాడు

బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి ఇద్దరు హీరోలను ఎంచుకోవడంతోనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హిస్టారికల్ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జక్కన్న డైరెక్షన్ లో తారక్ స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి,యమదొంగ వంటి విభిన్న సినిమాలు తెరకెక్కాయి. హిట్ అందుకున్నాయి.

అలాగే మగధీర మూవీతో చెర్రీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన జక్కన్న ఇపుడు ఇద్దరితో ఆర్ ఆర్ ఆర్ తీస్తున్నాడు. వరుస హ్యాట్రిక్ మూవీస్ తో దూసుకెళ్తున్న తారక్ ఒకవైపు,రంగస్థలం మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చెర్రీ కల్సి నటిస్తున్న ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగింది. దీనిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తున్నప్పటికే తాజా తారక్,చెర్రీ లలో ఎవరి నటన పైచేయి కాబోతోందో అని చర్చ నడుస్తోంది.

గతంలో మల్టీస్టారర్ మూవీస్ బ్యాలెన్స్ తప్పకుండా తీసేవారు. తేడా వస్తే చాలా విమర్శలు చెలరేగడం,మళ్ళీ ఆ హీరోలు కల్సి నటించకూడదని నిర్ణయించుకోవడం వంటి పరిణామాలు ఇండస్ట్రీలో జరిగాయి. అయితే తారక్ ఇప్పటివరకు పౌరాణిక, చారిత్రక,సోషల్ మూవీస్ చేయగా, చెర్రీ మాత్రం ఈవిషయంలో కొంచెం వెనకబడి ఉన్నాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ లో తారక్ డామినేషన్ గానీ ఉంటుందా అనే అనుమానం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్ లో చెర్రీ యాక్టింగ్ అదరగొట్టాడు. అందుకే ఇద్దరి నటన పోటాపోటీగా నడుస్తుందని టాక్.