సుధీర్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడైనప్పటికీ ,మహేష్ బాబు బావ అయినా సరే,సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 10ఏళ్ళు అయిపొయింది. ప్రస్తుతం నాని విలన్ గా తాను హీరోగా ‘వి’ మూవీ చేసాడు. ఇది ఓటిటి లో విడుదల కాబోతోంది. డిఫరెంట్ మూవీస్ తో విభిన్న పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. కండలు తిరిగిన శరీరం,మంచి నటన ఉన్న హీరో అయినా సరే,సరైన బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు.
హిట్ కోసం 2010నుంచి ఎంతగానో పరితపిస్తు న్నాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు 2012లో శివ మనసులో శృతి’అంటూ వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. 2013లో ప్రేమ కథా చిత్రం 35కోట్ల బిజినెస్ సాధించి,సుధీర్ కి పేరుతెచ్చింది. అదే ఏడాది ఆడు మగాడ్రా బుజ్జి మూవీ 25కోట్ల బిజినెస్ చేసింది. ఈ రెండు హిట్ గానే నిలిచాయి. 2015లో మోసగాళ్లకు మోసగాడు,కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ .. ,దొంగాట,భలే మంచి రోజు మూవీస్ లో నటించాడు. ఇందులో మోసగాళ్లకు మోసగాడు ప్లాప్ కాగా,మిగిలిన మూడు ఏవరేజ్.
శ్రీ శ్రీ అనే తెలుగు సినిమా బాబీ అనే ఇంగ్లీషు సినిమా లతో 2016లో నటించిన సుధీర్ 2017లో శమంతకమణి హిట్ అయింది. 2018లో నన్ను దోచుకుందువటే మూవీ ప్లాప్ అయింది. వీర భోగ వసంతరాయలు మూవీ కూడా అదే ఏడాది వచ్చినా కమర్షియల్ సక్సెస్ గా నిల్చింది. ఇప్పుడు చేస్తున్న వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ లో రాబోతోంది. సుధీర్ కి మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే విలన్ గా నేచురల్ స్టార్ నాని చేస్తున్నాడు.