Movies

ఆనంద్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ మూవీ మంచి కాఫీ లాంటి సినిమా అనే కాప్షన్ తో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. బాపు నుంచి బాగా చేసావని శేఖర్ కి కాంప్లిమెంట్ ఇచ్చిన ఈ మూవీ కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా వెనుక చాలా తపన ,కష్టం ఉన్నాయి. అందరిలా అమెరికా వెళ్లిన శేఖర్ కమ్ముల అక్కడ ఉండబుద్ధి కాలేదు. హైదరాబాద్ మీద దృష్టి ఉండిపోయింది. పైగా తన ఆలోచనలకు సినిమా ఫీల్డ్ కరెక్ట్ అని ఆలోచించాడు.

వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి,హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిలిం మేకింగ్ యూనివర్సిటీలో చేరాడు. అమెరికా అమ్మాయిలు దేనికి చలించరు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాంటి అమ్మాయితో ఓ స్టోరీ రెడీ అయింది. ఇక మాస్టర్స్ డిగ్రీ కూడా వచ్చేయడంతో భారత్ కి ప్రయాణమయ్యాడు. హైద్రాబాద్ వచ్చిన వెంటనే సిటీ కార్పొరేషన్ బ్యాంకు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా 20వేల జీతానికి చేరాడు. మరోపక్క సినీ సినీ ట్రయల్స్ . కృష్ణవంశీ సింధూరం మూవీ తీస్తుంటే అసిస్టెంట్ గా ఛాన్స్ అడిగితె కుదరలేదు.

ఇక ఒకరోజు తన సిస్టర్ గైనకాలజిస్ట్ కావడంతో ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ఓ యువతి అబార్షన్ కి వచ్చింది. అమెరికా వెళ్ళాక పిల్లల్ని కంటే అక్కడి పౌరసత్వం వస్తుంది కదా అందుకు అలా అబార్షన్ కి సిద్ధమవ్వడంతో శేఖర్ కమ్ములను ఆ ఘటన కదిలించింది. కథ రాయడం మొదలు పెట్టాడు. అతడి అన్నయ్య, ఫ్రెండ్స్ సపోర్ట్ తో డాలర్ డ్రీమ్స్ మూవీని 18లక్షలతో 18రోజుల్లో పూర్తిచేసాడు. కమర్షియల్ గా లాస్ అయినప్పటికీ డబ్యు డైరెక్టర్ గా అవార్డు,ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చాయి. మూడేళ్లకు సినిమా కథ రెడీ అయింది.

కానీ 80లక్షల బడ్జెట్ కి ప్రొడ్యూసర్స్ ముందుకి రాకపోవడంతో నేషనల్ ఫిలిం డవలప్ మెంట్ కార్పొరేషన్ ని అప్రోచ్ అవ్వగా, 40లక్షలు పెట్టడానికి ముందుకొచ్చింది. హీరోగా పవన్ కళ్యాణ్ అనుకుంటే కుదరలేదు. దాంతో రాజా మెదిలాడు. హీరోయిన్ రూపక్యారెక్టర్ కోసం ఆసిన్,సదా అందర్నీ ట్రై చేసిన వర్కవుట్ కాలేదు. కొత్తవాళ్లే బెటర్ అని భావించి, ఆయుష్ యాడ్ లో షాంపూ మార్చుకోకుండా ఉండే కోడలి రోల్ లో కనిపించిన అమ్మాయి రూపలా కనిపించింది.

శేఖర్ వెంటనే ఎంక్వైరీ చేయడంతో ఆమె ముంబయిలో మోడలింగ్ చేసున్న బెంగాలీ అమ్మాయి కమిలిని ముఖర్జీ అని తెలిసింది. మొత్తానికి సంప్రదిస్తే ఒకే చెప్పింది. మ్యూజిక్ గా రాధాకృష్ణ సెలక్ట్. వేటూరి పాటలు. విజయ్ సి కుమార్ కెమెరా. శేఖర్ ఉండే కాలనీలోనే ఎక్కువ షూటింగ్. చాలా తపనతో తీయడం వలన బడ్జెట్ రెండున్నరకోట్లు తేలింది. BRU కంపెనీతో టైఅప్. 2004అక్టోబర్ 15న శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిలీజ్ రోజున ఆనంద్ రిలీజ్ చేయడం సాహసమే. అదే కల్సి వచ్చింది. మొదట్లో 5ప్రింట్స్ తో రిలీజైన మూవీ క్రమేపీ 23పింట్లకు చేరింది. మంచి సమీక్షలు వచ్చాయి. దీంతో శేఖర్ కి మంచి ఊపు వచ్చింది.

అన్నీ నేచురల్ డైలాగ్స్ . తెలుగు ,హిందీ,ఇంగ్లీషు మిక్సింగ్ డైలాగ్స్ బాగా నచ్చేసాయి. కమిలినీకి సింగర్ సునీత డబ్బింగ్ హెల్ప్ అయింది. అందరూ కొత్తవాళ్లే కనుక బాగా నటించారు. బయ్యర్స్ కూడా వచ్చారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని సెంటర్స్ అమ్మేశాడు. 2005జనవరి 28న 100రోజుల వేడుక. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ‘నేను ఈమధ్య చూసిన సినిమాల్లో బాగున్న మూవీ ఇది. న్యూ జనరేషన్ కి గైడ్ లాంటిది’అని కితాబిచ్చారు. డబ్బు కంటే నీవు అనుకున్నది సాధించడం బాగుంది అంటూ తండ్రి నుంచి ప్రశంస. ఇక ఈ మూవీ హైదరాబాద్ లో 130రోజులు ఆడేసింది.