Movies

బిగ్ బాస్ అఫర్ కి నో చెప్పిన 9 మంది సెలబ్రేటిస్…ఎవరో చూడండి

ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తిచేసుకున్న బుల్లితెర రియాల్టీ షో నాల్గవ సీజన్ ఎట్టకేలకు ఈనెలలోనే ఆరంభం కానుంది. కరోనా కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడిన బిగ్ బాస్ షో 4వ సీజన్ పక్కా కరోనా నిబంధనలు పాటించి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే హోస్ట్ గా కింగ్ నాగార్జున కన్ఫర్మ్ కావడం,ప్రోమో రావడం తెలిసిందే. సహజంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా సెలక్ట్ చేసేముందు పాపులార్టీ ఉన్నవాళ్ళని తీసుకుంటారని టాక్. ఎందుకంటే, ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుంది. అందుకే ఇందులోకి రావాలని చాలామంది భావిస్తారు. కానీ నో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.

టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరొందిన హీరో తరుణ్ ని బిగ్ బాస్ షో లోకి తీసుకు రావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిసారి నో చెప్తున్నాడు. ఇప్పుడు కూడా నో చెప్పేసాడు. అంతేకాదు ఎప్పటికీ బిగ్ బాస్ షోలోకి రానని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. యాంకర్ రవిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు కూడా కల్సి రాలేదట. యూట్యూబ్ స్టార్ నైనా కు రోజుకి లక్ష ఇస్తామని చెప్పినా ఒకప్పుకోలేదట. జబర్దస్త్ హైపర్ ఆది కూడా బిగ్ బాస్ ఆఫర్ కి నో చెప్పినట్లు టాక్.

ఇక మొన్నటి వరకూ కొరియోగ్రాఫర్ రఘు,ప్రణవి వస్తారని అనుకున్నా వేరే కారణాల వలన దూరంగా ఉన్నారట. యాంకర్ రేష్మి కి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుత పొజిషన్ లో హౌస్ లోకి వెళ్లడం ఇష్టం లేక నో చెప్పింది. అలాగే యాంకర్ విష్ణుప్రియను కూడా హౌస్ లోకి తీసుకురావాలని సంప్రదించారట. కానీ తనకున్న ఛాన్స్ ల దృష్ట్యా హౌస్ లోకి వెళ్లలేని చెప్పిందట. ఇక హీరోయిన్ శ్రద్ధాదాస్ ని గత సీజన్ లోనే తీసుకోవాలని చూసారు. ఈసారి ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా సరే,నో చెప్పింది.