సమంత చివరిగా ఎప్పుడు ఏడ్చిందో తెలుసా…వైరల్ అవుతున్న న్యూస్
అందంతో ,అభినయంతో ఎంతో ఫాలోయింగ్ తెచ్చుకున్న అక్కినేని కోడలు సమంత పెళ్ళికి ముందు స్టార్ హీరోయిన్ గా ఉంటె,పెళ్లయ్యాక ఇంకా బిజీ అయింది. ఏ పాత్రనైనా అవలీలగా చేస్తూ తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఆమె క్రేజ్ అందరికీ తెల్సిందే.
ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటివి జరిగితే రకరకాల డిజైన్స్ తో కూడిన డ్రెస్ లు వేసుకుని అలరించే సమంత అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ అభిమానాలను అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో జరిగిన ఓ ప్రోగ్రాం లో ఆమె పాల్గొంది. ‘ఆస్క్ సామ్ సెషన్’పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానుల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చింది.
మీరు చివరి సారిగా ఎప్పుడు ఏడ్చారు’అని ఓ నెటిజన్ కొంటెగా అడిగేసరికి.. ‘ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషం. ఈమధ్య ఇంట్లో వాళ్లకి దద్దర్లు వస్తే ఏడుపు వచ్చేసింది”అని చెప్పుకొచ్చింది. అదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ‘మీరు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు’అనే ప్రశ్న మరో నెటిజన్ అడిగాడు. ‘ధ్యానం చేసి ఒత్తిడిని తట్టుకుంటా’అని బదులిచ్చింది.