Movies

అనుష్క గురించి తమన్నా షాకింగ్ కామెంట్సఅంత మాట అనేసిందా ?

ఆడదానికే ఆడదే శత్రువు అని అంటుంటారు. ఎక్కడ చూసినా ఇద్దరు ఆడవాళ్లకు పడదు. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ మామూలు రేంజ్ లో ఉండదు. కొందరు హీరోయిన్స్ అయితే కనీసం పలకరింపులు కూడా చేసుకోరు. ఇలా ఎన్నో గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారాలు సాగిపోతుంటాయి. నిజానికి ఇండస్ట్రీలో ఇందుకు భిన్నంగా ఉంటుందని మిల్కీ బ్యూటీ తమన్నా మాటలను బట్టి తెలుస్తోంది. స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ ఉన్నా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒకరంటే ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, ఒకరికి ఒకరు సాయం కూడా చేసుకోవడం ఉంటుందని అంటున్నారు.

ఎప్పుడో తమన్నా 15 ఏళ్ల కింద హీరోయిన్‌గా వచ్చి వరుసపెట్టి ఛాన్స్ లు కొట్టేస్తూ, అగ్ర హీరోలతో చేస్తూ బ్లాక్ బస్టర్ మూవీస్ కి వేదిక అవుతోంది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత హ్యాపీడేస్‌తో తొలి విజయం సొంతం చేసుకుంది. బద్రీనాథ్‌తో బ్రేక్ అందుకున్న ఈ అమ్మడు ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. ఇప్పటికీ తన అందం నటనతో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చిన టాలీవుడ్ మూవీ బాహుబలి మూవీలో కూడా తమన్నా నటన అదిరిపోయింది. అయితే ఎప్పుడో యోగ భామ అనుష్క తనకు చేసిన సాయాన్ని ఇంకా గుర్తు పెట్టుకుని తమన్నా చెప్పుకొచ్చింది.

అందరితోనూ తమన్నా క్లోజ్‌గా ఉంటుంది. కాజల్, శృతి హాసన్ కూడా తనకు మంచి స్నేహితులు అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక అయితే అనుష్కతో అయితే ఇంకా క్లోజ్ గా ఉంటుంది. కెరీర్ ప్రారంభించిన కొత్తలో తనకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉండేవాడు కాదని, అప్పుడు అనుష్క తనకు చాలా సాయం చేసిందని ఈ మిల్కీ బ్యూటీ చెప్పింది. ఇప్పటికీ తనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అనుష్కకే కాల్ చేస్తానని చెప్పింది. అలా అవసరమైనపుడు ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటా మని చెప్పింది. ఇక ఇద్దరూ కలిసి బాహుబలి మూవీ చేయడం యాదృచ్ఛికమే.