బొమ్మరిల్లు సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు…ఇది నిజం
ఆర్య షూటింగ్ సమయంలో డైరెక్టర్ సుకుమార్ కి అసిస్టెంట్ గా చేసిన భాస్కర్ అంటే నిర్మాత దిల్ రాజుకి అభిమానం ఏర్పడి, పైగా పనితనం ఉన్నవాడు కావడంతో దర్శకుడిగా ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆర్య తర్వాత భద్ర షూటింగ్ లో దిల్ రాజు బిజీగా ఉన్నాడు. ఆసమయంలో ఓ విదేశీ మూవీ చూసిన దిల్ రాజు బాగా నచ్చేసింది. భాస్కర్ ని పిలిచి సిడి ఇచ్చి దీని ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకో,భద్ర తర్వాత నీతో మూవీ స్టార్ట్ అని దిల్ రాజు చెప్పాడు. హుషారుగా వెళ్లి ,అంతే హుషారుగా కథతో వచ్చాడు. బాగానే ఉంది. కానీ సెకండాఫ్ లో సరిగ్గా రాలేదని భాస్కర్ లోనే అసంతృప్తి. దీంతో ఇది పక్కనే పెట్టేసి ఇంకో కథతో వస్తానని చెప్పేసాడు. సక్సెస్ ఫుల్ ఫాథర్ గా చెప్పుకుంటూ కొడుకు లైఫ్ ని డిస్ట్రబ్ చేసే తండ్రి కథ ఎప్పటినుంచో భాస్కర్ మదిలో ఉంది. తండ్రి ఇబ్బంది పడకూడదని బర్న్ అయ్యే కొడుకు. ఇక ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఎంజాయ్ చేసే అమ్మాయి. వీరి ముగ్గురి అంశాలతో కథ. మళ్ళీ ఇప్పుడు బయటకు తీసాడు.
అసోసియేట్ డైరెక్టర్ వాసూవర్మతో కూర్చుని కథకు మరింత వన్నె తెచ్చి ,దిల్ రాజుకి కథ చెబుతున్నాడు. ఎక్కడా డౌట్ వ్యక్తం చేయకుండా కథ విన్నాడు. కాసేపటికి తేరుకుని, ఈ సినిమా చేస్తున్నాం అని దిల్ రాజు చెప్పేసి, చెన్నై వెళ్ళాడు. హీరో సిద్ధార్ధ్ ని కలిసాడు. కథ కొంచెం విని,ఒకే చెప్పేసాడు. ప్రకాష్ రాజ్ ఫాథర్ క్యారెక్టర్ కి ఫిక్స్. తల్లిగా జయసుధ ఒకే. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకే. మాటలు అబ్బూరి రవి సెలెక్ట్. హీరోయిన్ గా సింధు తులాని అనుకున్నా ,జెనీలియాకు చూసాక ఆమెను కన్ఫర్మ్ చేసారు. అదే సమయంలో వైవిఎస్ చౌదరి కొత్తగా తీస్తున్న దేవదాస్ సినిమా ఇన్విటేషన్ వచ్చింది. అందులో ఓ పేరు చూసి,దిల్ రాజు ఆనందంతో భాస్కర్ కి ఫోన్ చేసి,మన సినిమా పేరు బొమ్మరిల్లు అని చెప్పేసాడు. వైవిఎస్ చౌదరి బ్యానర్ పేరు అదే.
ఇక సినిమా షూటింగ్ లో అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తో అనుబంధం కోసం వారం రోజులు ఆయన దగ్గరకు వెళ్లి మరీ ఎటాచ్ మెంట్ ని సిద్ధార్ధ్ పెంచుకున్నాడు. ఇక క్లైమాక్స్ మిగిలి ఉండగా ప్రకాష్ రాజ్ చెన్నై వెళ్లి ఉదయం వచ్చేస్తానని బయలుదురుతూ స్క్రిప్ట్ పేపర్ చేతిలో ఉంచుకున్నాడు. ముందు చెప్పినదానికి ,స్క్రిప్ట్ లో ఉన్నదానికి పస లేకపోవడంతో దిల్ రాజుకి ఫోన్ చేసి,ఒకరోజు ఆలస్యం అయినా పర్వాలేదు,కొంచెం ఆలోచించి చేద్దాం అని ప్రకాష్ రాజ్ చెప్పడంతో మర్నాడు అందరూ సిట్టింగ్ వేశారు. అర్ధరాత్రి దాటేవరకూ చర్చ నడిచింది.
మర్నాడు సిద్ధార్ధ్ వచ్చి ,రిహార్సల్స్ అయ్యాక, రామానాయుడు స్టూడియో సెట్ లో షూటింగ్ స్టార్ట్. నాలుగు నిమిషాల డైలాగ్ ని సింగిల్ టేక్ లో ఒకే చేసారు. ఆ టైం లో లీనమై భాస్కర్ ఏడుస్తూనే ఉన్నాడు. 9కోట్లతో తీసిన ఈ సినిమా 2006ఆగస్టు 9న రిలీజ్. బ్లాక్ బస్టర్ టాక్. ఎంత కలెక్షన్ వచ్చిందని అడిగితె బొమ్మరిల్లు సంతృప్తికి ఖరీదు కట్టే షరాబు లేడు అని దిల్ రాజు ఇప్పటికీ చెబుతాడు. భాస్కర్ కి ఈ సినిమా ఇంటిపేరుగా మారింది. ఏడిద నాగేశ్వరరావు మనసు దోచిన మూవీ కూడా ఇదే. సిద్ధార్ధ్ కి స్టార్ ఇమేజ్. జెనీలియాకు బిగ్ బ్రేక్.