Health

దగ్గు జలుబు… నిమిషాల్లో మాయం

వానాకాలం వచ్చిందంటే దగ్గు జలుబు తుమ్ములు గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తాయి. ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. మందులు వాడుతున్నా సరే చాలామందికి దగ్గు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రోజు వాటర్ తాగినప్పుడు చల్లని నీటిని కాకుండా గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో తులసి ఆకులు, మిరియాలు అల్లం వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. రోజుకి ఒకసారి తాగాలి. ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే మనం కలుగుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగే ఎలా చేస్తుంది.