Movies

గీతాంజలి సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా… అసలు నమ్మలేరు

సెల్యులాయిడ్ పై నాగార్జునకు ఓ ఇమేజ్ తెచ్చిన సినిమా గీతాంజలి. ఇండస్ట్రీలో పేరు తేవడంతో పాటు ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిన మూవీ ఇది. మాస్ మూవీస్ చేస్తున్న నాగ్ విభిన్నమైన సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతో అప్పటికే క్రేజీ డైరెక్టర్ గా ఉన్న మణిరత్నం తో సినిమా చేయాలని రెండు నెలలు తిరిగాడు. అయితే అగ్ని నక్షత్త్రం మూవీ ని తెలుగులో నాగ్,వెంకీ లతో రీమేక్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో ఘర్షణ పేరుతొ తెలుగులో డబ్బింగ్ అయింది. ఓ ఇంగ్లీషు మూవీ స్టోరీ లైన్ తో నాగ్ తో సినిమాకోసం స్క్రిప్ట్ పనిలో ఉండగా, ఓ 11ఏళ్ల ఢిల్లీకి చెందిన పాప కేన్సర్ తో బాధపడుతుంటే, ఆమె ఫీలింగ్స్ పేపర్ లో రాసేవారు. అది మణిరత్నాన్ని కదిలించింది. ఆపాప పేరు గీతాంజలి. దాంతో తాను రాసె కథకు ఆపేరునే టైటిల్ గా పెట్టేసాడు. రాజశ్రీ డైలాగ్స్ రాస్తే, వాటిని తమిళంలో రాయించుకుని మణి కరెక్షన్స్ చేసేవారు. వేటూరి సాంగ్స్ . ఇళయరాజా మ్యూజిక్. ఘర్షణతో టాప్ కెమెరామెన్ గా గుర్తింపు పొందిన పిసి శ్రీరామ్ సెలక్ట్.

హీరోయిన్ గా కొత్తవాళ్ళకోసం వేట. సుహాసిని ,తన పెళ్ళికి వచ్చిన ఓ అమ్మాయి ఈ సినిమాకి హీరోయిన్ కి మంచిదని భావించి సంప్రదించగా,ఒకే అయింది. కొన్ని రోజుల శిక్షణ ఇచ్చి 1988అక్టోబర్ 10న షూటింగ్ స్టార్ట్ చేసారు. 90శాతం షూటింగ్ ఊటీ తదితర ప్రాంతాల్లో జరిగింది. అక్కడ గెస్ట్ హౌస్ నే హీరోయిన్ ఇల్లుగా మార్చారు. చలిలో షూటింగ్ చాలా ఇబ్బంది అయింది. మంచు తదితర వాటి కోసం కెమెరామెన్ ఎక్కువ శ్రమించాడు. 40మంది పిల్లలు,20గుర్రాలు వినియోగించి ఒళ్ళంతా తుళ్లింత కావాలి సాంగ్ తీశారు. ఓ ప్రియా సాంగ్ కోసం 100ఒంటెలు ఉపయోగించారు. జగడ జగడం సాంగ్ కోసం 40కార్లు ఉపయోగించి కేవలం రాత్రి పూట చిత్రీకరించారు. క్లయిమాక్స్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరూ చనిపోతారు. కానీ ఫాన్స్ గొడవ చేయడంతో ‘ఇంకెన్నాళ్లు బతుకుతారో తెలియదు, కానీ బతికినన్నాళ్లు సంతోషంగా ఉంటారు’ అనే మెసేజ్ తో ఎండ్ చేసారు.

దాదాపు కోటి 20లక్షల బడ్జెట్ తో 60రోజుల్లో సినిమా తీశారు. అప్పట్లో పెద్ద బడ్జెట్ ఇది. రెమ్యునరేషన్ వద్దన్నా సరే, 7న్నరలక్షలు నాగ్ కి గౌరవంగా ముట్టజెప్పారు. 1989మే19న చాలా ఏరియాల్లో నిర్మాత నరసారెడ్డి సొంతంగా 42ప్రింట్స్ తో రిలీజ్ చేసారు. మొదటి రోజు ప్లాప్ టాక్. రివ్యూస్ కూడా అలానే వచ్చాయి. కానీ అనుకోకుండా థియేటర్లు అన్నీ యూత్ తో నిండిపోయాయి. కేన్సర్ తో బాధపడే హీరో హీరోయిన్స్ ఎప్పుడు చనిపోతారో తెలియదు కానీ,ఒకరికొకరు ప్రాణంగా లవ్ చేసుకోవడం,కథ,కథనం అన్నీ ఆకట్టుకున్నాయి. మణిరత్నం ఈమూవీని హృదయాలను తాకేలా దృశ్య కావ్యంగా మలిచారు.

హీరో హీరోయిన్ నటన,ఇళయరాజా మ్యూజిక్ ప్రాణం పోశాయి. హీరోయిన్ వాడిన డ్రెస్ లు గీతాంజలి డ్రెస్సులుగా పాపులర్ అయ్యాయి. తొలివారం 56లక్షల గ్రాస్,15కేంద్రాల్లో 50రోజులు,7సెంటర్స్ లో 100రోజులు ఆడింది. అన్ని కేంద్రాల్లో రికార్డ్ కొట్టి,వైజాగ్ లో 117రోజులతో ఆల్ టైం రికార్డ్. అద్భుత కలెక్షన్స్ తో పాటు 7నంది అవార్డులొచ్చాయి. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తమిళంలో 16ప్రింట్స్ తో విడుదల చేస్తే, తెలుగు కన్నా ఎక్కువ సూపర్ హిట్ కొట్టింది. . ఇక మలయాళంలో కూడా ఏవరేజ్.