Movies

ప్రభాస్ యోగి సినిమా డిజాస్టర్ కావటానికి వెనుక కారణం ఇదేనట

వివి వినాయక్ డైరెక్షన్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్,నయనతార జంటగా నటించిన యోగి మూవీ 2007సంక్రాంతికి రిలీజ్ అయింది. అయితే వినాయక్ కాంబో కావడంతో భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. కన్నడలో జోగి మూవీ ని తెలుగులో యోగిగా తీశారు. అక్కడ ఆడిన సినిమా ఇక్కడ ఎందుకు క్లిక్ అవ్వలేదని పరిశీలిస్తే,తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో శారదను తీసుకోవడం డైరెక్టర్ చేసిన పెద్ద తప్పు అని విశ్లేషణ.

అప్పటికే శారద బామ్మ రోల్స్ చేస్తూ ప్రభాస్ తల్లిగా చేయడాన్ని ఫాన్స్ జీర్ణించుకోలేదు. ఇక తల్లికి బంగారు గాజులు చేయించాలని, హీరో కర్నూల్ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్ లో పనిచేస్తూ లక్ష్య సాధనలో ఓ కేసులో జైలుకి వెళ్తాడు. కొడుకుని వెదుకుతూ తల్లి హైదరాబాద్ రావడం,దగ్గరగానే మసలుతున్న గుర్తించలేకపోవడం, చివరకు యోగిని చూడకుండానే కన్నుమూయడం ఆడియన్స్ ఎక్కలేదు. విషాదం ఇప్పటికీ ముగియదా అన్నట్లు టాగ్ లైన్ ఇంగ్లీషులో తగిలించడం ఆడియన్స్ కి నచ్చలేదు.

ఇందులో జర్నలిస్ట్ పాత్రచేసిన నయన కూడా మెప్పించలేకపోయింది. జర్నలిస్ట్ గా ఉంటూ గ్యాంగ్ స్టర్ తో సాంగ్స్ ఊహించుకోవడం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. తల్లి శవం పక్కనుంచి వెళ్తున్నా ఆమె ఎవరో యోగి గమనించకపోవడం ఆడియన్స్ భరించలేదు. అలీ,సునీల్,వేణు మాధవ్ కామెడీ తప్ప సినిమాలో పెద్దగా ఆకట్టుకున్న సీన్స్ లేవు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బయ్యర్లను నిలువునా ముంచేసింది.