Movies

సుమంత్ స్టార్ హీరోగా ఎందుకు ఎదగలేకపోయాడు.. చేసిన 4 తప్పులు ఇవే

అక్కినేని నటవారసుడిగా సుమంత్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని మంచి సినిమాలతో అలరించినప్పటికీ ఎందుకో రాణించలేకపోయాడు. అక్కినేని మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా, నిర్మాత యార్లగడ్డ వారి కొడుకుగా సుమంత్ కి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇక ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. మంచి నటన ఉంది. అయినా తేడా కొట్టింది. మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు ధీటుగా రాణించాల్సిన సుమంత్ దెబ్బతినడానికి కారణాలు విశ్లేషిస్తే,.. చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి గల సుమంత్ ఫిలిం కోర్సు కూడా నేర్చుకున్నాడు. 1997నుంచి హీరోగా ఎంట్రీ ఇప్పించాలని నాగ్ చేసిన ప్రయత్నం 1999లో ఫలించింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ప్రేమకథ మూవీతో హీరోగా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర దెబ్బతినడంతో చాలా కేర్ తో చేసిన యువకుడు మూవీ ఏవరేజ్ అయింది. ఇక కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సంబంధం కూడా డిజాస్టర్.

ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ ఇవ్వలేదు. ఇక ముందే ఒప్పుకున్నా స్నేహమంటే ఇదేరా, రామ్మా చిలకమ్మా మూవీస్ ప్లాప్ అవ్వడంతో కొన్నాళ్ళు గ్యాప్ లోకి వెళ్లాలని భావించాడు. రెండేళ్ల తర్వాత నాగ్ దగ్గరుండి స్వయంగా నిర్మించిన మూవీ సత్యం హిట్ కొట్టింది. సుమంత్ కి గుర్తింపు తెచ్చినా స్టార్ హోదా రాలేదు. గౌరీ మాస్ లుక్ ఇవ్వగా, గోదావరి మూవీ క్లాస్ లో ఇమేజ్ పెంచింది. 2011లో గోల్కొండ హైస్కూల్ మూవీ వరకూ హిట్ లేదు. దగ్గరగా దూరంగా, మళ్ళీ రావా లాంటి మూవీస్ కమర్షియల్ గా సక్సెస్. తాజాగా కపటధారి మూవీతో సుమంత్ మనముందుకు వస్తున్నాడు. నిజానికి మొదటి సినిమా హిట్ అవ్వాలి. అప్పుడే స్టార్ హోదా వస్తుంది. కానీ మొదటి మూవీ రివర్స్ అయింది. భీమినేని శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు లతో సిట్టింగ్ అయినప్పటికీ వర్మను నాగ్ ఎంచుకోవడం తొలితప్పు.

ఇక మొదటి మూవీ ప్రభావం తర్వాత మూవీస్ పై పడింది. కెరీర్ లో 20సినిమాలు వదిలేయడం పెద్ద దెబ్బ. ఇందులో ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్. తొలిప్రేమ మూవీతో సుమంత్ ని ఎంట్రీ ఇప్పించాలని చూస్తే,నాగ్ రిజెక్ట్ చేసాడు. ఇదే మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ ని అనూహ్యంగా మార్చేసింది. ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన నువ్వే కావాలి మూవీ అడిగితె ఒప్పుకోలేదు. తర్వాత మహేష్ రిజెక్ట్ చేయడంతో తరుణ్ కి వెళ్ళింది. నువ్వొస్తావనీ మూవీ సుమంత్ వదిలెయ్యడంతో నాగ్ ఇష్టపడి చేసి,హిట్ అందుకున్నాడు. ఇక క్లాసిక్ లవ్ స్టోరీ గల మనసంతా నువ్వే మూవీ మహేష్ ,సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఉదయ్ కిరణ్ కి చేరింది. పూరి జగన్నాధ్ మొదటగా ఇడియట్ మూవీకి సుమంత్ నే అడిగాడు. బాడ్ లక్ వలన రిజెక్ట్ చేసాడు. ఈ సిన్మాలు సుమంత్ చేసి ఉంటె సూపర్ స్టార్ అయ్యేవాడు.