వదులుగా సాగినట్టు ఉండే చర్మానికి….క్యాబేజీ ప్యాక్స్
మృదువైన ఆరోగ్యవంతమైన చర్మం కావాలని ఎవరు కోరుకోరు. అయితే కొంత మందికి వయస్సులోనే చర్మం మీద ముడతలు వస్తాయి. అంతేకాక చర్మం వదులుగా, సాగినట్టుగా కనిపిస్తుంది. అలాంటి వారికీ ఈ క్యాబేజీ ఫేస్ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.
రెండు లేదా మూడు క్యాబేజీ ఆకులను తీసుకోని మెత్తని పేస్ట్ చేయాలి. దీనికి రెండు స్పూన్ల బియ్యం పిండి,రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం
చేయాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే చర్మం బిగుతుగా మారటమే కాకుండా కొత్త మెరుపును సంతరించుకుంటుంది. జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు నూనెకి బదులుగా నీటిని ఉపయోగించాలి.
ఐదు స్పూన్ల క్యాబేజీ పేస్ట్ ను తీసుకోని మూడు స్పూన్ల బియ్యం పిండి,గుడ్డు తెల్లసొన వేసి బ్లెండర్ సాయంతో బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
క్యాబేజీలో ఉన్న పొటాషియం,పాస్పరస్,విటమిన్ ఎ,బి చర్మాన్ని వదులుగా లేకుండా బిగుతుగా ఉండేలా చేస్తాయి.