గొప్ప నటుణ్ని కోల్పోయిన టాలీవుడ్
సీనియర్ నటుడు, కమెడీయన్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. బ్రహ్మపుత్రుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జయప్రకాష్ రెడ్డి ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్, నాయక్, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్, సరైనోడు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకొని అభిమానుల్లో తనదైన ముద్రను వేసాడు.
కమెడియన్‌గానే కాకుండా విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించాడు. నేడు తెల్లవారుజామున గుంటూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే పడి అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల ఆయన స్వగ్రామం కాగా సినిమాలోకి రాకముందు ఆయన ఎస్సైగా పనిచేశారు.