Beauty Tips

హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏమిటో తెలుసా ?

హైపర్ పిగ్మెంటేషన్ అనేది ముఖం మరియు శరీర ఇతర బాగాలపై రావచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు చర్మం రంగు లేకపోవటం,నల్లని మచ్చలు,మంగు మచ్చలు,సన్ టాన్ వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే కనుక హైపర్ పిగ్మెంటేషన్ తో బాధ పడుతున్నారని అర్ధం.

హైపర్ పిగ్మెంటేషన్ అనేది తీవ్రమైన సమస్య కాదు. దీని నివారణకు అనేక రకాల నివారణలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి గురించి చర్చిద్దాం.

మొదట హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏమిటి, హైపర్ పిగ్మెంటేషన్ ఎలా ఏర్పడుతుంది, రావటానికి గల కారణాలను వివరంగా తెలుసుకుందాం.

పిగ్మెంట్ అంటే ఏమిటి?
చర్మ టోన్, పాచెస్, మార్క్స్, ముదురు మచ్చలు, తేలికపాటి మచ్చలు వంటి మార్పులు చర్మంలో కలుగుతాయి. ప్రధానంగా పిగ్మెంట్ ను రెండు వర్గాలుగా విభజించవచ్చు.

హైపర్ పిగ్మెంటేషన్
హైపర్ పిగ్మెంటేషన్ అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనపడుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతం నల్లని పాచెస్ లేదా నల్లని మచ్చలతో ఉంటుంది.

హైపర్ పిగ్మెంటేషన్ సమస్య అనేది ముఖ్యంగా మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి కావటం వలన వస్తుంది. దీని వలన చర్మ టాన్ లేదా చర్మం రంగులో మార్పులు వస్తాయి.

మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు హైపో పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య పలితంగా చర్మం మీద తెల్లని మచ్చలు లేదా కొన్ని ప్రాంతాల్లో చర్మం రంగు మారటం జరుగుతుంది.

శరీరంలో ఏ భాగంలో పిగ్మెంటు వచ్చే అవకాశం ఉంది? హైపర్ పిగ్మెంటేషన్ మరియు హైపో పిగ్మెంటేషన్ అనేది చేతులు, కాళ్లు, ముఖం,వీపు మరియు శరీరంలో ఏ ప్రాంతంలోనైనా రావచ్చు.

హైపర్ పిగ్మెంటు ఎవరిని ప్రభావితం చేస్తుంది?
హైపర్ మరియు హైపో పిగ్మెంటు ఎవరైనా ప్రభావితం చేస్తుంది. దీనికి ఆడ, మగ, పిల్లలు, పెద్దలు మరియు ముసలి వారు అనే తేడా ఉండదు. అలాగే పిగ్మెంటేషన్ సమస్యకి జాతి, కుల, లింగ భేదం తో ఎటువంటి సంబంధము లేదు.