Movies

RRR సినిమాలో అలియా భట్ బదులు ఏ హీరోయిన్ వస్తుందో ?

రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మరల ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. ఈ సినిమాలో అలియా భట్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. అయితే బాలీవుడ్ లో నేపోటిజం కారణంగా అలియా భట్ తాజా చిత్రం సడక్ 2 ఫలితం ఎలా ఉందో అందరికి తెలిసిందే. అత్యంత తక్కువ IMDB రేటింగ్ మాత్రమే కాకుండా, ట్రైలర్ కి సైతం డిస్ లైక్స్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాత్ర పై ఇపుడు చిత్ర యూనిట్ రీప్లేస్ మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో అలియా భట్ స్థానం లో మహానటి కీర్తి సురేష్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అధికారిక ప్రకటన చేసే వరకు హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ,ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.