రాజీవ్ ను పట్టుకుని ఏడ్చేసిన సుమ… అనుమానాలన్నీ పటాపంచలే?
రెండు దశాబ్దాలు దాటినా సరే, తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా సుమ దూసుకుపోతూనే ఉంది. పేరుకి మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో చక్కగా హవభవాలు పలికిస్తూ, పంచ్ డైలాగులతో సమయస్ఫూర్తితో తన టాలెంట్ ఏమిటో చూపిస్తోంది. ఇక దేవదాస్ కనకాల తనయుడు, నటుడు రాజీవ్‌తో ఈమెకు పెళ్లయి,పిల్లలు కూడా ఉన్నారు. మంచిగా జీవితం సాగిపోతోంది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ జంట విడిపోయినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఎప్పటినుంచో ఇలాంటి వార్తలు వస్తున్నా ఏమాత్రం యాంకర్ సుమ .. రాజీవ్ కనకాల స్పందించింది లేదు. ఖండించకపోతే నిజమే అనుకున్నట్టే ఈ విషయంలో కూడా చాలా మంది నిజమే అనుకున్నారు. దానికితోడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టినా కూడా సుమ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఇక పిల్లలు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు టాక్. దీంతో సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జోరందుకుంది.
అయితే తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చిన రాజీవ్ కనకాల , సుమతో నడిపిన కెమిస్ట్రీ చూస్తే థ్రిల్ అవ్వవల్సిందే. గతంతో పోలిస్తే ఇప్పుడే వీళ్ల మధ్య అన్యోన్యత ఉందన్నట్లు ఇద్దరూ కలిసి ఆడారు,పాడారు, ఉద్వేగం, కామెడీ పండించారు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తే, కచ్చితంగా టిఆర్పీ కూడా పెరిగిపోతుందన్నట్లు ఉంది. ఈ ఎపిసోడ్‌కు రాజీవ్, సుమ లకు అత్యంత సన్నిహితులైన సమీర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వచ్చి , కామెడీ అద్భుతంగా పండించారు. ప్రోమో చివర్లో రాజీవ్‌ను పట్టుకుని సుమ ఏడవడం, భర్త ఓదార్చడం ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఈ ప్రోమో చూసిన తర్వాత సుమ, రాజీవ్ మధ్య బంధం గట్టిదని తేలింది.