పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నారో తెలుసా ?
జ్యోతిష్కులు సూచించారని కొందరు, అభిమానులు తమ పేర్లను సులువుగా గుర్తుంచుకోవడానికి మరికొందరు తమ పేర్లను తగ్గించుకోవడం,మార్చుకోవడం వంటివి చేస్తుంటారు. అన్ని ఇండస్ట్రీస్ లో ఇది కామన్. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ల విషయం తీసుకుంటే,ఇలా చాలామంది ఉన్నారు. మొదటిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ని తీసుకుంటే, స్వయం కృషితో ఎదిగాడు.అయితే చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. సాంగ్స్,ఫైట్స్ లో అతడు ఎంతో కష్టపడి పైకి వచ్చి ,ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అలాగే మెగా బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా సొంత టాలెంట్ తో ఎదిగిన పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు.
తమిళ సూపర్ స్టార్ .రజనీకాంత్ నటనలో చూపే స్టైల్ విభిన్నం. ఇతని అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. నటుడయ్యాక రజనీకాంత్ గా పేరు మార్చుకున్నారు. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా భారతీయ సినిమా లోనే నిర్మాత.. ప్లేబ్యాక్ సింగర్.. దర్శకుడు.. నటుడు.. బహుముఖ ప్రజ్ఞాశా లి గా నిల్చిన కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సింగంగా ప్రసిద్ది చెందిన సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళులు సూరియా అని, తెలుగు వారు సూర్య అని పిలుస్తారు. అలాగే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాస్టర్ .. దళపతి విజయ్ అద్భుతమైన నటుడు. ఇతడి పేరు విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి చంద్రశేఖర్ రాజకీయాల్లో పాపులర్.
జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని అసలు పేరు నందమూరి తారక రామారావు జూనియర్. తాత పేరు పెట్టారు. బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ స్టార్ గా ఎదిగి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ఇక దగ్గుబాటి వారి వారసుడు ఇటు హీరోగా,అటు విలన్ గా రాణిస్తున్న రానా అసలు పేరు రామానాయుడు దగ్గుబాటి. రానా గా కుదించుకున్నాడు. 15 సంవత్సరాల కెరీర్ వ్యవధిలో ధనుష్ ఎన్నో మిరాకిల్స్ చేశాడు. అనేక అవార్డులను సాధించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డులు సాధించిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. ఇలా హీరోయిన్స్ లో కూడా చాలామంది ఉన్నారు.