Health

మెదడులోకి కరోనా వైరస్ ప్రవేశిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?

భారతదేశంలో కరోనా రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ దాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ ఫలితాలలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయాలు వింటే చాలా భయం కలగడం ఖాయం. అమెరికాలో చేస్తున్న పరిశోధన ప్రకారం కరోనా వైరస్ మెదడు మీద కూడా ప్రభావం చూపుతుందని తెలిసింది. కరోనా వైరస్ మెదడు లో లో ఉండే ఆక్సిజన్ కణాలను చుట్టుముట్టి తలనొప్పి మతిమరుపు గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుందని ఈ పరిశోధనలో తేలింది.

ఈ వైరస్ కి మెదడుకు రక్తప్రసరణను అడ్డుకునే సామర్థ్యం కూడా ఉందని చెబుతున్నారు. అలాగే మెదడులో కరోనా వైరస్ సోకిన వాళ్లే త్వరగా చనిపోయారని పరిశోధకులు అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు. ఏది ఏమైనా కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.