Kitchen

పాపడ్ కబాబ్

కావలసినవి:

మసాలా పాపడ్ – 6
కాటేజ్ చీజ్ – 50 గ్రా.
ఉల్లిపాయ ముక్కలు(చిన్నవిగా కోయాలి) – 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ ముక్కలు(చిన్నవిగా కోయాలి) – టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు(చిన్నవిగా కోయాలి) – 2 టీ స్పూన్లు
నూనె – వేయించడానికి తగినంత
చీజ్ – 25 గ్రా
ఏలకుల పొడి – చిటికెడు
చాట్ మసాలా – సరిపడా

తయారు చేసే విధానం

ఒక బౌల్ లో క్యాప్సికమ్ ముక్కలు,ఉల్లి ముక్కలు,కాటేజ్ చీజ్,చాట్ మసాలా, కొత్తిమీర తరుగు,పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తురిమిన చీజ్‌ను కలపాలి. ఇప్పుడు మసాలా పాపడ్స్ తీసుకోని నీటిలో ముంచి వెంటనే బయటకు తీయాలి. ఈ పాపడ్ లో పైన తయారుచేసుకున్న చీజ్ మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసి రెండు వైపులా మిశ్రమం బయటకు రాకుండా మూయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండిలో నూనె పోసి,కాగిన తర్వాత పైన తయారుచేసుకున్న పాపడ్ రోల్స్‌ను వేసి గోల్డ్ కలర్ వెచ్చే వరకు వేయించాలి. వేడి వేడి పాపడ్ కబాబ్స్ ను మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు.