ఈ ఆహారాలను తీసుకుంటే చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది
చర్మం అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది సహజం కూడా. దాని కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది.
క్యారెట్స్
క్యారెట్స్ లో బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడటమే కాకుండా ఎండ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
గ్రీన్ టీ
రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగినా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి.
టమోటా
టమోటాలో లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తుంది.
ఆకుపచ్చని కూరలు
ఆకుపచ్చని కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ ఎ, సి, ఇలు సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి మేలు చేయటమే కాకుండా చర్మంపై ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తుంది.