పెదవులు పగలకుండా ఉండాలంటే….BEST TIPS
వాతావరణంలో అతి వేడి లేదా చల్లదనం అనేవి ముందుగా ముఖం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఎండకు లేదా చలికి ఎక్కువగా గురయ్యేది పెదవులే. పెదవులు పగిలితే అందవిహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యపరముగా కూడా అనేక సమస్యలు వస్తాయి. పెదవులు పగలకుండా ఉండటానికి ఈ క్రింది సూచనలను పాటించండి.
1. పెదవులు పగలటానికి శరీరం డీ హైడ్రేషన్ ఒక కారణం అని చెప్పవచ్చు.శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే ప్రతి రోజు ఎనిమిది ను౦చి పది గ్లాసుల నీరు తాగడ౦తప్పనిసరి అని చెప్పవచ్చు.
2. పగటి సమయంలో కూడా లిప్ బామ్ ను రాసుకోవాలి. ముఖ్యంగా లిప్ బామ్ రాసుకోకుండా బయటకు వెళ్ళకూడదు.
3. లిప్ స్టిక్ వేసుకొనే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీం బేస్డ్ లిప్ స్టిక్ మాత్రమే ఉపయోగించాలి.
4. తీసుకునే ఆహారం ద్వారా కూడా పెదవులు పగలకుండా చూసుకోవాలి. ఒమేగా 3 ప్యాటి ఆమ్లాలు ,ఐరన్,విటమిన్ బి కాంప్లేక్స్ వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా పెదవులు పగలకుండా చూసుకోవచ్చు.
5. రాత్రి పడుకునే ముందు విటమిన్ E ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ను పెదవులపై రాసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన పెదవులు పగలకుండా ఉంటాయి.
https://www.chaipakodi.com/